బాలయ్య కోసం మరో బాలీవుడ్ నటుడు!

బాలయ్య 100వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటీమణి హేమమాలిని రాజమాతగా ముఖ్యభూమిక పోషించనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. షారుక్ ఖాన్ తాజా చిత్రం “దిల్ వాలే”లో కాజోల్ తండ్రిగా నటించిన కబీర్ బేడీని మరో ముఖ్యపాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

జూన్ లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించుకోనున్న ఈ చిత్రంలో కథానాయికగా నయనతార నటిస్తున్నట్లు వార్తలొస్తున్నప్పటికీ.. దర్శకనిర్మాతలు ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus