‘కభీర్ సింగ్’ చిత్రంలో హీరో పాత్ర అభ్యంతరకరంగా ఉందని.. ఈ చిత్రం తెలుగులో హిట్టయ్యిందంటే వారికి ఏమాత్రం టేస్ట్ లేదని.. ఇలా రకరకాలుగా మన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం పై నెగటివ్ రివ్యూలు రాసారు కొంతమంది బాలీవుడ్ సినీ విశ్లేషకులు. వారు ఎంత నెగటివ్ ప్రచారం చేసినప్పటికీ ‘కబీర్ సింగ్’ కలెక్షన్ల పై ఆ ఎఫెక్ట్ ఎంతమాత్రం పడలేదు. అంతేకాదు ఈ చిత్రం సల్మాన్ ఖాన్ రికార్డు ను కూడా బద్దలుకొట్టడం సంచలనంగా మారింది.
అత్యధిక వసూళ్ళు సాధించే సల్మాన్ చిత్రాలు.. సోమవారం రోజున కూడా 16 కోట్ల వరకూ వసూళ్ళు వస్తుంటాయి. సాధారణంగా సోమవారం కలెక్షన్లు డ్రాప్ అవుతాయన్న సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ‘కభీర్ సింగ్’ చిత్రం ఏకంగా మొదటి సోమవారం 18 కోట్ల వరకూ రాబట్టిందట. ఓ మీడియం రేంజ్ ఉన్న షాహిద్ కపూర్.. ఓ స్టార్ హీరో ఫీట్ ను అధిగమించడం సాధారణ విషయం కాదు. మంగళవారంతో ‘కభీర్ సింగ్’ చిత్రం 100 కోట్ల మార్కును చేరుకోవడం ఖాయమని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం. ఇదే విధంగా వసూళ్ళ పరంపర కొనసాగితే.. ‘యూరి’ చిత్ర కలెక్షన్లను కూడా అధిగమించే అవకాశం ఉందని వారు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి రాంగోపాల్ వర్మ, రాజమౌళి ల తరువాత బాలీవుడ్ లో సత్తా చాటిన తెలుగు దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా కూడా చేరిపోయాడు.