సమాజంలో విడాకుల సంస్కృతి నానాటికీ పెరుగుతోంది. ఎవరిని అడిగినా ఇదే మాట చెబుతారు. అయితే దీనికి కారణం ఏంటి అని అనుకుంటున్నారు అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతారు. అయితే ఎక్కువ మంది చెప్పే విషయం ఒకటి ఉంది. ఇప్పుడు ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్ కూడా అదే మాట అంటోంది. మారుతున్న అనుబంధాలు, పెరుగుతున్న విడాకుల కేసులపై కాజల్ ఇటీవల స్పందించింది. దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మనుషుల మధ్య అనుబంధాలపై సోషల్ మీడియా ఎక్కువగా ప్రభావం చూపుతోందని కాజల్ అభిప్రాయపడింది. స్మార్ట్ ఫోన్‌ల కారణంగా దంపతుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. రెస్టరంట్లు, డిన్నర్ డేట్‌లకు వెళ్లినప్పుడు చాలా మంది.. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మొబైల్స్ చూసుకుంటూ ఉన్నారని, కొందరైతే అందులోనే మునిగిపోతున్నారని చెప్పింది.
భార్యాభర్తలు ఎప్పుడూ మాట్లాడుకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం తగ్గిపోవడం వల్లే బంధాల్లో దూరాలు పెరుగుతున్నాయని కాజల్ వ్యాఖ్యానించింది. నేను, నా భర్త ఖాళీ సమయాన్ని గౌరవిస్తాం. ప్రతి వారం క్రమం తప్పకుండా డిన్నర్‌కు వెళ్తాం. ఫోన్లను పక్కనపెట్టి ప్రశాంతంగా మాట్లాడుకుంటాం అని కాజల్ చెప్పింది. సోషల్ మీడియా వ్యామోహం నుండి బయటపడి భాగస్వామితో సమయాన్ని గడపడం అలవాటు చేసుకోవాలని సూచించింది.
కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును అక్టోబరు 30, 2020లో వివాహం చేసుకుంది. వీరికి నీల్ అనే బిడ్డ ఉన్నాడు. పెళ్లి అయిన కొత్తల్లో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్ ఆ తర్వాత తిరిగి సినిమాల్లోకి వచ్చింది. ఇటీవల ‘ది ఇండియా స్టోరీ’తో ప్రేక్షకుల్ని పలకరించిన కాజల్.. చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణతో ‘దాదా’ సినిమాలో నటిస్తుండగా.. బాలీవుడ్‌లో ‘రామాయణ’ రెండు పార్టుల్లో నటిస్తోంది. ఒక ‘రామాయణ’ ఈ దీపావళికి…. రెండో ‘రామాయణ’ వచ్చే ఏడాది దీపావళికి వస్తుంది.