ఆ హీరోతో రొమాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను : కాజల్

దశాబ్దకాలం పైనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. కుర్ర హీరోయిన్ల పోటీ ఎక్కువైనప్పటికీ తట్టుకుని మరీ అవకాశాలు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్లో ఉంది. ‘కాజలిజం’ వంటి గ్రూప్ లు ఎన్నో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. పారితోషికం పరంగా కూడా ఈమె ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం కాజల్.. ‘ముంబై సాగా’ ‘ఇండియన్ 2’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇక తాజాగా మంచు లక్ష్మీ హోస్ట్ చేస్తున్న ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ఈ బ్యూటీ.. కొన్ని ఆసక్తికరమైన సంగతుల్ని చెప్పుకొచ్చింది.

‘ఇప్పటివరకు మీరు నటించిన సినిమాల్లో ఏ హీరోతో రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డారు’ అని మంచు లక్ష్మీ.. కాజల్ ను ప్రశ్నించగా.. దానికి కాజల్ జవాబిస్తూ… ” ‘దో లఫ్జోన్ కే కహానీ’ చిత్రంలో రణదీప్ హుడా ఇంటిమేటెడ్ సీన్స్ లో నటించడానికి ఇబ్బంది పడ్డాను. మాములుగా ప్రేమించిన వ్యక్తి కళ్ళల్లో చూసి మనం ప్రేమను తెలియపరుస్తాం..! కానీ.. ‘దో లఫ్జోన్ కే కహానీ’ సినిమాలో నేను అంధురాలి పాత్రను పోషించాను. ఇద్దరి మధ్య ప్రేమను చూపించడానికి కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ టైములో చాలా ఇబ్బంది పడ్డాను. నాకు తెలియని వ్యక్తితో అలాంటి సీన్లలో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది” అంటూ చెప్పుకొచ్చింది.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus