బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కథానాయికగా కాజల్ అగర్వాల్ కన్ఫర్మ్ !!

ఇప్పటివరకూ స్టార్ డైరెక్టర్లతో కలిసి సినిమాలు చేస్తూ కథానాయకుడిగా తన స్టార్ డమ్ ను పెంచుకొన్న బెల్లంకొండ శ్రీనివాస్ మొదటిసారిగా ఓ కొత్త దర్శకుడైన శ్రీనివాస్ నిర్దేశకత్వంలో వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం హైద్రాబాద్ లో మొదటి షెడ్యూల్ జరుపుకొంటున్న ఈ చిత్రంలో కథానాయికగా టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేశారు. ఆల్రెడీ బాలీవుడ్ ఆర్టిస్ట్ నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తుండడం విశేషం.

ఈ సందర్భంగా వంశధార క్రియేషన్స్ అధినేత నవీన్ శొంటీనేని (నాని) మాట్లాడుతూ.. “బెల్లంకొండ శ్రీనివాస్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయనున్నాం. మంచి థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం శ్రీనివాస్ అద్భుతమైన కథ సిద్ధం చేసుకొన్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఈ చిత్రంలో కథానాయికగా క్రేజీ లేడీ కాజల్ అగర్వాల్ కనువిందు చేయనుంది. నెక్స్ట్ షెడ్యూల్ నుంచి ఆమె షూటింగ్ లో భాగస్వామ్యం కానుంది. అబ్బూరి రవి, ఛోటా కె.నాయుడు, ఎస్.ఎస్.తమన్, ఛోటా కె.ప్రసాద్, స్టన్ శివ లాంటి సీనియర్ & టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కూడా భాగస్వామి అయ్యాడు. ప్రస్తుతం హైద్రాబాద్ లో మొదటి షెడ్యూల్ జరుగుతోంది” అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus