టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది అనుష్క. గత రెండు సంవత్సరాలలో అనుష్క… ‘బాహుబలి2’ ‘భాగమతి’ చిత్రాలలో తప్ప… మరి ఏ చిత్రంలోనూ నటించలేదు. ఇక అనుష్క లాగే.. కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్న.. నయనతార కు కూడా టాలీవుడ్ లో మంచి క్రేజ్ వుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇరు భాషల్లో స్టార్ హీరోయిన్లు అంటే.. ఈ ఇద్దరి భామల పేర్లే చెప్తారు.. అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకి 4 నుండీ 5 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అయితే.. ఆ తరువాత స్థానంలో అనుష్కనే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అనుష్క రెమ్యూనరేషన్ చాలా తక్కువంట. ఇటీవల హేమంత్ మధుకర్ తో చేయనున్న సినిమాకిగాను అనుష్క కేవలం 1.25 కోట్లు మాత్రమే తీసుకుందని సమాచారం. ఇక టాలీవుడ్ గ్లామర్ డాల్.. కాజల్ ఒక్కో సినిమాకి 2 కోట్లు వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటూ అనుష్క కంటే ముందు వరుసలో ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే దీనికి ముఖ్య కారణం… కెరీర్ ప్రారంభం నుండీ అనుష్క కేవలం కథాకథనాలకే ప్రాధాన్యత ఇస్తుందనీ…. పారితోషికాన్ని ఈమె ఎప్పుడూ డిమాండ్ చేయదని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు. అనుష్క తో లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని తీసినప్పటికీ దాదాపు 30 కోట్ల వరకూ కలెక్షన్లు రాబడతాయని ‘అరుంధతి’ ‘భాగమతి’ చిత్రాలు నిరూపించాయి. అయితే అనుష్క కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ కాజల్ టాప్ లో ఉన్నప్పటికీ… అనుష్కనే టాప్ హీరోయిన్ అని చెప్పినా తప్పు లేదనే చెప్తున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు.