మన తెలుగు చిత్ర పరిశ్రమలో రోజుకో 10మంది అందాల తారలు రకరకాల ప్రాంతాల నుంచి దిగుమతి అయిపోతున్నారు…అయితే అందులో ముంబై వేదికగా అనేక మంది సుందరీమణులు టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మహా అయితే ఒక ఏడాది..లేదంటే రెండు ఏళ్లు, తప్పితే పెద్దగా అవకాశాలు లేని తారలు ఉన్నారు. కానీ ఎన్నో ఏళ్ల నుంచి సినీ పరిశ్రమలో అందాల తారగా ఎదిగింది కాజల్. ‘లక్ష్మి కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ భామ, ఆతరువాత బడా హీరోలతో బడా సినిమాలు చేసింది.
ఇదిలా ఉంటే సహజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతకే అనుకుంటున్న రోజుల్లో తనలోని అన్ని కోణాలని ప్రేక్షకులకు చూపించాను అని, డ్యాన్స్ – కామెడీ – గ్లామర్ – సెంటిమెంట్.. వీటిలో ఏ ఒక్కదానికో పరిమితం కాకుండా అన్ని రకాల పాత్రలను పండించడం అంటే తనకు చాలా ఇష్టం అని, అందుకే అన్ని రకాల పాత్రలు చేస్తూ వస్తున్నాను అని ఆమె తెలిపింది. ఇక ఆమె యక్టింగ్ స్కిల్స్ గురించి అడగగా..సినిమాల కోసం ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ తీసుకోలేదు, యాక్టింగ్ స్టార్ట్ చేసాకే అన్నీ నేర్చుకున్నా..అంటూ తెలిపింది.
ఇప్పటివరకూ మీరు చేసిన పాత్రలో అతి కష్టం అయిన పాత్ర ఏది అంటే…ఏ విషయంలోనూ, ఏ పాత్రలోనూ ఇప్పటివరకూ…ఇబ్బంది పడలేదు కానీ.. కెరియర్ మొదలు పెట్టిన తొలి రోజుల్లో ఏడుపు సీన్లంటే ఇబ్బందిగా ఉండేది. చిన్నప్పటి నుంచి నాకెప్పుడూ ఏడ్చిన అలవాటు లేకపోవడమే ఇందుకు కారణం’ అంటూ తెలిపింది. ఇలా తనలోని అన్ని పాత్రలను ప్రేక్షకుల ముందు ఉంచి వారిని మెప్పిస్తుంది కాజల్. మరి ఈ భామ మరిన్ని మంచి సినిమాల్లో నటించి మెప్పించాలని కోరుకుందాం.