నీటిలో కూడా భర్తతో రొమాన్స్.. వైరల్ అవుతున్న కాజల్,గౌతమ్ ల ఫోటోలు..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైకు చెందిన ప్రముఖ బిజినెస్మెన్ గౌతమ్ కిచ్లుతో కాజల్ పెళ్లి జరిగింది. పెళ్ళైన వెంటనే ఈమె తన భర్తతో కలిసి హనీమూన్ ట్రిప్ నిమిత్తం.. మాల్దీవ్స్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వీరు ప్రశాంతకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా కాజల్ అయితే పెళ్లి ఫోటోల కంటే తన హనీమూన్ ఫొటోలనే ఎక్కువగా పోస్ట్ చేసిందని చెప్పొచ్చు.

ఇప్పటికే కాజల్ జంట హనీమూన్ కోసం రూ.46 లక్షల వరకూ ఖర్చు చేశారనేది తాజా సమాచారం. కాజల్ అక్కడి నుండే ప్రమోషన్లను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కాజల్ తన భర్త గౌతమ్ తో కలిసి అండర్ వాటర్‌లో డైవ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఓ ఫొటోలో కాజల్ మాత్రమే నీళ్ళలో స్విమ్ చేస్తూ కనిపిస్తుంది. మరో ఫొటోలో ఇద్దరూ చెట్టా పట్టాలేసుకుంటూ రొమాన్స్ చేస్తున్న విధానాన్ని కూడా మనం గమనించవచ్చు.

పెళ్ళైన తరువాత కూడా కాజల్ సినిమాల్లో నటిస్తాను అని అభిమానులకు తెలిపింది. అయితే తాను కమిట్ అయిన సినిమాలను మాత్రమే కాజల్ చేస్తుందని ఆమె సన్నిహిత వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆమె ‘ఆచార్య’ షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల షూటింగ్ లేట్ అవ్వడంతో కాజల్ హనీమూన్ ట్రిప్ ను పొడిగించినట్టు టాక్.

1

2

3

4

5


6

7

8

9

10

11

12

13

14

15

16

17

more..

1

2

3

4

5

6

7

8

9

10

పెళ్లి ఫోటోలు
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36


Most Recommended Video

‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus