Kajal Aggarwal: ఆ విషయంలో మాత్రం కాజల్ అగర్వాల్ ను నిజంగా మెచ్చుకోవాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ కు (Kajal Aggarwal)  క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ కొన్ని రోజుల క్రితం అభిమానులతో ముచ్చటించగా ఎందుకు తెలుగులో మాట్లాడరంటూ కామెంట్లు చేశారు. అయితే తాను తెలుగు మాట్లాడగలనని మాట్లాడే సమయంలో తప్పు మాట్లాడతానేమో అనే భయంతో మాత్రమే తాను ఎక్కువగా తెలుగులో మాట్లాడనని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. అయితే సత్యభామ ఈవెంట్ లో కచ్చితంగా తెలుగులో మాట్లాడతానని మాట ఇచ్చిన కాజల్ అగర్వాల్ ఆ మాటను నిలబెట్టుకున్నారు.

ఈ విషయంలో మాత్రం కాజల్ అగర్వాల్ ను నిజంగా మెచ్చుకోవాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాజల్ తన మాటలతో నిజంగానే ఫిదా చేశారని నెటిజన్లు చెబుతున్నారు. తెలుగు నేర్చుకుని తెలుగు మాట్లాడిన కాజల్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సత్యభామ (Satyabhama) సినిమా జూన్ 7వ తేదీకి వాయిదా పడగా ఆ తేదీన బాక్సాఫీస్ వద్ద ఒకింత గట్టి పోటీ ఉండనుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సత్యభామ సక్సెస్ సాధిస్తే తెలుగులో మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఈ బ్యూటీ బిజీ కావడం గ్యారంటీ అని చెప్పవచ్చు. టాలీవుడ్ సీనియర్ హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో కాజల్ అగర్వాల్ కు రాబోయే రోజుల్లో మరిన్ని ఆఫర్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

కాజల్ అగర్వాల్ షూటింగ్స్ సమయంలో కూడా నిర్మాతలను ఇబ్బంది పెట్టరనే టాక్ ఉంది. కాజల్ కు ఇతర భాషల నుంచి సైతం ఆఫర్లు వస్తున్నాయి. కాజల్ నటిగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఆకట్టుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమాలో ఫైట్ సీన్స్ లో అదరగొట్టారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కంటెంట్ ఆకట్టుకుంటే కాజల్ కు భారీ సక్సెస్ దక్కడం ఖాయమని చెప్పవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus