టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ కి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. అక్కడి ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఆమె ఖంగుతింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వీవీడీ కొబ్బరి నూనె సంస్థ వాణిజ్య ప్రకటనలో నటించేందుకు కాజల్ 2008లో ఒప్పందం కుదుర్చుకుంది. తాను నటించిన ప్రకటనను ఏడాదిపాటే ప్రసారం చేయాలని కాజల్ నిబంధన విధించింది. అయితే ఆ ప్రకటన ఆ తర్వాత కూడా ప్రసారం చేస్తుండడంతో.. తనతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, అందువల్ల ఆ సంస్థ తనకు 2.50 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ 2011లో కాజల్ అగర్వాల్ మద్రాస్ హైకోర్టులో పిటిషిన్ వేసింది. ఆ ప్రకటనను తక్షణం నిలిపివేయించాలని సంస్థను ఆదేశించాలని కోరింది. కాజల్ పిటిషన్‌ను విచారించిన కోర్టు ధర్మాసనం ఆమె అభ్యంతరాలను కొట్టివేసింది.
చట్టప్రకారం ఆ ప్రకటన కాపీ రైట్స్ దానిని రూపొందించిన సంస్థకే చెందుతాయని పేర్కొంది. ఆ ప్రకటనను ఒక్క ఏడాదే ప్రసారం చేయాలనే హక్కు కాజల్‌కు ఉండదని, వాణిజ్య ప్రకటన ప్రమోషన్ హక్కులు ఆ సంస్థకు 60 ఏళ్ల వరకు ఉంటాయని న్యాయమూర్తి జస్టిస్ టి.రవీంద్రన్ స్పష్టం చేశారు. ఈ తీర్పుతో కాజల్ షాక్ తింది. చట్టం పూర్తిగా తెలుసుకోకుండా పిటిషన్ వేయకూడదని తెలుసుకుంది. ఇక ఆమె హీరోయిన్ గా నటించిన నేనే మంత్రి నేనే రాజు సినిమా రేపు రిలీజ్ కాబోతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.