Kajal Aggarwal: ఆహా.. స్ట్రాంగ్ రెమ్యునరేషన్

టాలీవుడ్ చందమామ అనగానే గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. గత దశాబ్ద కాలానికి పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ దాదాపు అందరి హీరోలను కవర్ చేసేసింది. తమిళ్ తెలుగు అని తేడా లేకుండా అగ్రహీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. పెళ్లి తరువాత కూడా బ్యూటీ హంగామా ఏ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. అయితే ఈ బ్యూటీ ఇక నుంచి ఓటీటీ వరల్డ్ లో కూడా బిజీ అవ్వాలని ఫిక్స్ అయ్యుందట.

మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లలో నటించాలని ఆలోచిస్తోంది. ఇదివరకే ఒకసారి కాజల్ హాట్ స్టార్ లో ఒక వెబ్ సిరీస్ చేసింది. ‘ లైవ్ టెలికాస్ట్’ అనే ఆ హర్రర్ కాన్సెప్ట్ ఏ మాత్రం క్లిక్కవ్వలేదు. పైగా కాన్సెప్ట్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఒక రేంజ్ లో వచ్చాయి. ఆ తరువాత వెబ్ సిరీస్ లో నటించే ఛాన్సులు చాలానే వచ్చినప్పటికీ అమ్మడు ఒప్పుకోలేదు. ఇక ఫైనల్ గా ఇటీవల అల్లు అరవింద్ సలహా మేరకు ఆహా యాప్ కోసం ఒక వెబ్ కంటెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

డైరెక్టర్ మారుతి రాసిన స్క్రిప్ట్ ను మరొక దర్శకుడు తెరకెక్కిస్తాడట. అందులోనే కాజల్ లీడ్ రోల్ లో నటించనుంది. అందుకు రెండు కోట్లకు పైగానే రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఇక గతంలో ఆహాలో తమన్నా 11th Hour అనే వెబ్ సిరిస్ చేయగా కేవలం 2కోట్లే ఇచ్చినట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు కాజల్ కు అంతకంటే కాస్త ఎక్కువగానే ఇచ్చి ఒప్పించారు. మరి ఆహా ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో..?

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus