కాజల్ క్రేజ్ అయినా గోపీచంద్ కు కలిసొస్తుందా..?

కాజల్ ప్రస్తుతం తేజ డైరెక్షన్లో ‘సీత’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి స్పందన లభిస్తుంది. ఈ చిత్రంలో కాజల్ నెగెటివ్ రోల్ లో కనిపించబోతుంది టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. ఏప్రిల్ 2 లేదా మూడో వారంలో ఈ చిత్రం విడుదల కాబోతుందని టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం కాజల్ కు మరింత మంచి గుర్తింపు తెస్తుందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ చిత్రం ఇలా పూర్తయ్యిందో లేదో మరో చిత్రం చేయడానికి కాజల్ రెడీ అయ్యిపోతుందట.

వివరాల్లోకి వెళితే… గోపీచంద్ హీరోగా… నూతన దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం డైరెక్షన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ ను ఎంచుకున్నారట. గోపీచంద్ తో కాజల్ జతకట్టనుండడం ఇదే మొదటి చిత్రం ఇదే కావడం విశేషం . దీంతో ఈ కాంబినేషన్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ‘శ్రీ వెంకటేశ్వర చలన చిత్రం’ బ్యానర్ పై బీవీ.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జూన్ మొదటి వారం నుండీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. దాదాపు 4 సంవత్సరాల నుండీ వరుస ప్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్ కు కాజల్ క్రేజ్ కలిసొచ్చాయినా హిట్టందుకుంటాడేమో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus