కాజల్ కూల్ గానే వార్నింగ్ ఇచ్చిందిగా..!

కుర్ర హీరోయిన్ల పోటీ ఎక్కువ అవ్వడంతో కాస్త డల్ అయ్యింది మన టాలీవుడ్ చందమామ కాజల్. దశాబ్దకాలం నుండే తెలుగు, తమిళ భాషల్లో అగ్ర తారగా కొనసాగుతూ వస్తున్న ఈ చందమామ.. ఈ మధ్య ఆఫర్లు లేక రెమ్యునెరేషన్ కూడా తగ్గించేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఓ చిత్రం చేయడానికి రెడీ అయిన కాజల్ ఇప్పుడు కోలీవుడ్ లో కమల్ సరసన ‘భారతీయుడు2’ చిత్రంలో కూడా నటిస్తుంది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో తన కొత్త ఫోటోలను పోస్ట్ చేస్తూ బిజీగా ఉండే ఈ భామ.. తాజాగా అభిమానులతో చాట్ సెషన్ పెట్టింది. ఇందులో తన పెళ్ళి గురించి అడిగిన ప్రశ్నకి కూడా చాలా స్వీట్ గా సమాధానమిచ్చింది ఈ బ్యూటీ.

కాజల్ ట్విట్టర్ ఖాతా ఇప్పటికే మూడు మిలియన్ల ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో #askkajal హ్యాష్ ట్యాగ్ పేరిట చాట్ సెషన్ పెట్టి అభిమానులతో ముచ్చటించింది. ఎంతో ఓపికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పింది. ‘నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు నన్ను పెళ్ళి చేసుకుంటారా.. మీ రిప్లై కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ… “ఇంకా చాలా ప్రయత్నించాలి.. అది అంత సులభంగా జరిగే విషయం కాదు. ఇంకాస్త ప్రయత్నించండి” అంటూ సరదాగా సమాధానమిచ్చింది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus