Bigg Boss 5 Telugu: కాజల్ గేమ్ ఆడితే ఇలాగే ఉంటుందా ? విన్నర్ ఎవరో పసిగట్టిందా..?

బిగ్ బాస్ హౌస్ లో కాజల్ గేమ్ రాను రాను పదునొక్కుతోంది. వీక్స్ గడిచే కొద్ది కాజల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారుతోంది. ముఖ్యంగా సన్నీ విషయంలో స్టాండ్ తీస్కోవడంతో కాజల్ కి ఇప్పుడు ఫ్యాన్ గ్రూప్స్ పుట్టుకొచ్చాయి. అందరికంటే కాజల్ స్ట్రాటజీనే హౌస్ లో వర్కౌట్ అవుతోందని అంటున్నారు. అంతేకాదు, ఫస్ట్ నుంచీ బిగ్ బాస్ అంటే ఇష్టంతో అడుగుపెట్టిన కాజల్ గేమ్ లో టాస్క్ లలో పార్టిసిపేట్ చేస్తూ స్ట్రాంగ్ గా మారింది.

అవతల ఉన్నది ఎవరైనా సరే, వాళ్ల గేమ్ గురించి ముఖంపైన చెప్పడం అనేది కాజల్ ని హౌస్ లో మరింత స్ట్రాంగ్ గా మార్చింది. ముఖ్యంగా ఎవిక్షన్ పాస్ విషయంలో కాజల్ తీస్కున్న నిర్ణయం బిగ్ బాస్ లవర్స్ ని ఆకర్షించింది. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అంటూ కాజల్ తీసుకున్న డెసీషన్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాజల్ ఫైర్ ట్రక్ లో కూర్చుని తీస్కున్న కాల్ శ్రీరామ్ చంద్ర

నచ్చలేదని చెప్పినా తను తీసుకున్న నిర్ణయం పై నిర్భయంగా నిలబడింది. తన ఫ్రెండ్ కి ఎవిక్షన్ పాస్ ఇద్దామనే అలా ఆడాను అని చెప్పింది. కాజల్ గేమ్ ఆడితే ఇలాగే ఉంటుందని నెటిజన్స్ కామెంట్ చేసేవరకూ ఎదిగింది. నామినేషన్స్ అప్పుడు శ్రీరామ్ చంద్ర ఇదే పాయింట్ పై మాట్లాడినపుడు నాకు నా ఫ్రెండ్ కి ఇవ్వాలనిపించింది. తనకి విన్ అవ్వడం అంటే ఇష్టం అతడ్ని విన్నర్ గా చూడాలని ఇఛ్చాను అంటూ చెప్పింది.

అంటే, కాజల్ సన్నీ విన్నర్ అవుతాడని ముందుగానే ఊహించిందా అనేది ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు, ఎప్పుడూ డిఫరెంట్ స్ట్రాటజీలని పాటిస్తూ గేమ్ లో ముందుకు వచ్చిన కాజల్ ఇప్పుడు టాప్ 5లోకి వెళ్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus