Bigg Boss 5 Telugu: శ్రీరామ్ అన్న మాటలకి కాజల్ ఎందుకు హర్ట్ అయ్యిందో తెలుసా..!

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయ్యింది. ఇందులో నియంత మాటే శాసనం అంటూ సింహాసనం ఇచ్చాడు బిగ్ బాస్. ఎవరైతే ముందుగా ఈ సింహాసనం పై కూర్చుంటారో వాళ్లు సేఫ్ జోన్ లో ఉంటారు. మిగతా ఇంటి సభ్యులు ఒక ఛాలెంజ్ ఆడతారు. ఇందులో లాస్ట్ లో మిగిలిన ఇద్దరు సభ్యుల్లోనుంచీ నియంత అయిన ఇంటి సభ్యుడు ఒకర్ని సేఫ్ చేసి ఒకరిని కెప్టెన్సీ రేసులో నుంచీ తప్పించాలి. ఇక్కడే హౌస్ మేట్స్ ఫేవరిటిజం చూపిస్తారా లేదా అనేది తెలిసిపోతుంది.

ఇందులో భాగంగా ఫస్ట్ సింహాసనం పైన సిరి కూర్చుంది. రవి , సన్నీలు లీస్ట్ వచ్చారు. సన్నీని అవుట్ చేసి, రవిని సేఫ్ చేసింది సిరి. ఆ తర్వాత సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యింది.ఈ సెకండ్ రౌండ్ లో శ్రీరామ్ సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. ఇక్కడే చాలాసేపు ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేశారు హౌస్ మేట్స్. లెగ్స్ ని పైకి లేపుతూ హైట్ లో ఉన్న వాల్ పై స్ట్రెచ్ చేస్తూ స్లిప్పర్స్ ని అతికించాల్సి ఉంటుంది. ఇందులో కాజల్, ఇంకా రవి ఇద్దరూ లీస్ట్ లో ఉన్నారు.

వీళ్లిద్దరిలో ఒకరిని సేఫ్ చేసే బాధ్యత శ్రీరామ్ పైకి వచ్చింది. ఇక్కడే కాజల్ ని ప్రశ్నలు వేస్తూ శ్రీరామ్ లాజికల్ గా లాక్ చేయాలని చూశాడు. కెప్టెన్ అయితే నువ్వు ఏం చేస్తావ్ అని అడిగాడు. అలాగే, ఫైర్ ఇంజన్ టాస్క్ లో ఒకవేళ నువ్వు కెప్టెన్ ఇంకా సంచాలక్ అయితే ఏం చేస్తావ్ ఇద్దర్నీ కాల్చేస్తావా అంటూ మరోసారి నిలదీశాడు. దీనికి జవాబుగా అసలు నేను కెప్టెన్ అయితే ట్రక్ ఎక్కేదాన్ని కాదని చెప్పింది కాజల్. అంతేకాదు, నాకు మనస్పూర్తిగా నీకు ఇవ్వాలని ఉంది కానీ, నీకు ఇస్తే ఏంచేస్తావో అని భయమేస్తోంది అంటూ మాట్లాడాడు శ్రీరామ్.

నేను ఇంతవరకూ కెప్టెన్ అవ్వలేదు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇమ్మని రిక్వస్ట్ చేసింది కాజల్. అయినా, కూడా శ్రీరామ్ కన్విన్స్ అవ్వలేదు. తనకి సరైన ఆన్సర్ రాలేదని డిస్ క్వాలిఫై చేస్తూ గేమ్ నుంచీ అవుట్ చేశాడు. దీంతో బాగా హర్ట్ అయిన కాజల్, తొక్కలో డిస్కషన్స్ ఎందుకు, రవికి స్ట్రయిట్ గా ఇచ్చేస్తే బాగుంటుంది కదా, ముందే రవికి ఇస్తున్నానని చెప్పాలి కదా, నాకు ప్రశ్నలు వేయడం ఎందుకు అంటూ ఎమోషనల్ అయ్యింది. శ్రీరామ్ పై సీరియస్ అవుతూ ఈ లాస్ట్ ఛాన్స్ కూడా పోయిందని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్లి భోరున విలపించింది. అక్కడికి వచ్చిన ప్రియాంక కాజల్ ని ఓదార్చే ప్రయత్నం చేసింది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus