ఇప్పుడు నా పై ఒత్తిడి ఎక్కువయ్యింది : కాజల్

టాలీవుడ్లో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించేసింది కాజల్‌. ఇప్పటి వరకూ నెంబర్‌ వన్ హీరోయిన్ కొనసాగిన కాజల్ ఇటీవల కుర్రభామల జోరుతో కాస్త వెనుకపడిందనే కామెంట్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకే ఇప్పుడు కుర్ర హీరోల పక్కన కూడా నటించడానికి రెడీ అయ్యిపోతుంది. త్వరలో రాబోతున్న ‘సీత’ చిత్రంలో అయితే ఏకంగా నెగిటివ్ రోల్ లో కూడా కనిపించబోతుంది. ఇక కాజల్ ప్రస్తుతం నాయికా ప్రాధాన్యం ఉండే కథల వైపు దృష్టి పెడుతుంది.

ఇక ఇటీవల కాజల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇక ఈ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ… ‘‘నా కెరీర్‌ చాలా సంతృప్తిగా గడిచింది. నా మొదటి సినిమాతోనే అగ్ర దర్శకులు, కథానాయకుల దృష్టిలో పడటం నా అదృష్టం అనే చెప్పాలి. అగ్ర దర్శకులు, అగ్ర హీరోల సినిమాల్లో నటించడం వల్లే త్వరగా ఎదిగాను. ‘సినీ పరిశ్రమలో నేను రాణించగలనా’ అనే భయాలు నాకెప్పుడూ కలగలేదు. నాకు భయపడటానికి కూడా సమయం దొరికేది కాదు. కొన్ని గంటలైనా తీరిగ్గా కూర్చుని నా సినీ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. మంచో, చెడో నేను తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాన్నే ఇచ్చాయి. ఏమీ ఆలోచించకుండా కొన్ని సినిమాలు ఒప్పుకున్నాను. అవి కూడా నాకు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆ పేరునీ, స్టార్‌డమ్‌నీ కూడా నిలబెట్టుకోవాలి. అప్పటికంటే… ఇప్పుడే నా పై ఒత్తిడి ఎక్కువపడింది. నాకున్న అనుభవం వల్లే.. ఆ ఒత్తిడిని తట్టుకోగలుగుతున్నాను’’అంటూ కాజల్ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus