Kajal: పుష్ప2 సినిమాలో ఆ పాత్రలో కాజల్ నటిస్తున్నారా?

సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా సాయిపల్లవి ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వైరల్ అయినా ఆ వార్తల్లో నిజం లేదని మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది. అయితే పుష్ప2 మూవీలో కాజల్ నటిస్తున్నారంటూ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇండియన్2 సినిమాతో కాజల్ అగర్వాల్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లతో కూడా బిజీ కావాలని ఈ స్టార్ హీరోయిన్ భావిస్తున్నారు. పుష్ప2 సినిమాలో కాజల్ నటిస్తే మాత్రం ఈ సినిమా ఆమె కెరీర్ కు కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. పుష్ప2 సినిమాలో కాజల్ ఐటం సాంగ్ చేయడంతో పాటు కొన్ని సీన్లలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.

పుష్ప1 సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయగా ఆ సాంగ్ సినిమాకు హైలెట్ గా నిలవడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పుష్ప2 సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ కచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఆ సాంగ్ లో ఏ హీరోయిన్ ను ఎంపిక చేస్తారనే ప్రశ్నకు అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. కాజల్ ప్రస్తుతం సీనియర్ హీరోల ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టనున్నారు.

కొన్నేళ్ల క్రితం వరకు సీనియర్ హీరోల ప్రాజెక్ట్ లపై పెద్దగా దృష్టి పెట్టని కాజల్ ఆఫర్లు తగ్గడంతో కొన్ని విషయాలకు సంబంధించి మారారు. కాజల్ ప్రస్తుతం 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. సినిమాసినిమాకు కాజల్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెరీర్ విషయంలో కాజల్ అగర్వాల్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus