టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారని గత కొన్నిరోజులుగా వార్తలు ప్రచారంలోకి వస్తుండగా పలు ప్రాజెక్ట్ లకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. తాజాగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ అమ్మతనం ఎన్ని అనుభూతులను పంచుతుందో అదే స్థాయిలో సవాళ్లను విసురుతుందని అన్నారు. ఎంతోమంది తల్లులు అటు వర్క్ ను ఇటు ఇంటిని సమన్వయం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. చిన్నారిని ఇంట్లో వదిలి విధులకు హాజరయ్యే విషయంలో మహిళలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు.
ప్రస్తుతం తన పరిస్థితి కూడా అలానే ఉందని ఆమె కామెంట్లు చేశారు. ఫ్రీడమ్ టు ఫీడ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయాలను అభిమానులతో పంచుకున్నారు. నీల్ పుట్టిన తర్వాతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎంత కష్టమో అర్థమైందని ఆమె అన్నారు. కెరీర్ విషయంలో నేను పూర్తి చేయాల్సిన పనులు ఎక్కువగానే ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. కెరీర్ పరంగా పూర్తి చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకునే క్రమంలోనే తల్లినయ్యానని ఆమె కామెంట్లు చేశారు.
చిన్నచిన్న షూటింగ్స్ కోసం బయటకు వెళ్లాల్సి వచ్చిన సమయంలో నీల్ ను ఇంటిదగ్గర వదిలి వెళ్లడానికి మనసొప్పేది కాదని ఆమె వెల్లడించారు. కెరీర్ పనుల వల్ల బాబును నేను మాత్రమే చూసుకోవడం కుదరట్లేదని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. బయటకు వెళ్లిన సమయంలో నీల్ కు తగినంత సమయం కేటాయించడం లేదనే అపరాధ భావన నన్ను వేధిస్తోందని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఈ సమస్య వల్లే నేను జిమ్ కు కూడా వెళ్లడం లేదని ఆమె కామెంట్లు చేశారు.
ప్రతి తల్లి బిడ్డకు పాలు పట్టాలని అనుకుంటుందని నేనూ అంతేనని ఆమె తెలిపారు. వాడు పాలు తాగుతున్న సమయంలో నొప్పి వచ్చేదని ఆమె తెలిపారు. చిన్నారి అవసరాలకు అనుగుణంగా మనం ముందుకెళ్లాలని కాజల్ కామెంట్లు చేశారు. మనం మానసికంగా సిద్ధపడితే మాత్రమే అది సాధ్యమవుతుందని కాజల్ అగర్వాల్ తెలిపారు. ఈ క్రమంలో సవాళ్లు కష్టమే అయినా ఇష్టంతో చేశానని ఆమె అన్నారు.