బిగ్ బాస్ హౌస్ లో గెలవాలంటే తగ్గాలి అనే టాస్క్ ని పూర్తిచేశారు హౌస్ మేట్స్ అందరూ. ఇక నాలుగోవారం కెప్టెన్ ని ఎంచుకునే టైమ్ వచ్చింది. ఇందులో భాగంగా బాగా బరువు తగ్గిన ముగ్గురు జంటలు కెప్టెన్సీ పోటీదారులుగా పోటీ పడ్డారు. ఇందులో ముగ్గుర్ని మాత్రమే ఎంచుకోమని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో వాళ్ల జోడీలు కెప్టెన్ ని ఎంచుకునే పనిలో పడ్డారు. ఇంతలో పిజ్జాలు హౌస్ లోకి వచ్చాయి. పిజ్జా తింటున్న సిరి కాజల్ మైండ్ లో సన్నీ అన్నమాటలని వేసింది. అనీమాస్టర్ కి శ్వేత వాళ్లు గెలవడం సంచాలక్ గా నీకు ఇష్టం లేదని సన్నీ అనీమాస్టర్ తో అన్నాడని చెప్పింది.అందుకే ఇటువైపు బాగా సపోర్ట్ ఇచ్చిందని అన్నాడని సిరి కాజల్ బ్రైన్ లో ఒక మాట వేసింది.
అప్పుడు ప్రియ వచ్చి ఫేరటిజం ఏం చూపించలేదు. న్యూట్రల్ గానే చేసిందని సర్ధి చెప్పిందని ఇదే నాకు నచ్చదు ఇలాంటి మాటలే హర్టింగ్ గా అనిపిస్తాయి అంటూ మాట్లాడింది సిరి.తర్వాత కాజల్ సన్నీ విషయంలో క్లారిటీ తీస్కోవాలని డిసైడ్ అయ్యింది. కెప్టెన్ గా పోటీ చేస్తున్న సన్నీ వచ్చి కాజల్ సపోర్ట్ అడగగానే నువ్వు నేను సంచాలక్ గా ఉన్నప్పుడు అన్న మాటలు నాకు నచ్చలేదంటూ చెప్పింది. దీనికి సన్నీ ఎక్స్ ప్లనేషన్ కూడా ఇచ్చాడు. నిజానికి చిక్కులు తీసే టాస్క్ లో కాజల్ సంచాలక్ గా ఉన్నప్పుడు అనీమాస్టర్ అండ్ శ్వేత ఇద్దరూ కూడా ఆల్ మేస్ట్ గెలిచే టైమ్ లో ఎల్లో రోప్ సరిగ్గా లేదని అలా ఉంటే కన్సిడర్ చేయను అని కాజల్ చెప్పింది.
దీనికి సన్నీ బయటనుంచీ ఇది కరెక్ట్ కాదు.. సరిగ్గానే ఉంది చూడు అంటూ మాట్లాడాడు. అదే విషయాన్ని నువ్వు షణ్ముక్ అండ్ సిరిలకి ఎందుకు చెప్పలేదు అంటూ మాట్లాడాడు. ఇద్దరికీ చెప్పాలి కదా అనే విషయంపై సన్నీ ఆర్గ్యూ చేశాడు. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ లో కూడా సన్నీ సంచాలక్ ఓన్ రూల్స్ పెట్టుకుంటోందని అన్నాడు. ఆ తర్వాత విశ్వ అండ్ సన్నీ ఇద్దరూ చిక్కుల టాస్క్ లో టెక్నిక్ గురించి మాట్లాడుకున్నారు. అనీమాస్టర్ శ్వేతలు ఎందుకు గెలిచారో కూడా డిస్కస్ చేస్కున్నారు. అది అన్ సీన్ లో చూడచ్చు.