హీరోయిన్స్ ని ఇప్పుడు రెండుగా విడదీసి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లైంకిక వేధింపులు ఎదురవని వారు ఒక వర్గం అయితే.. దర్శకనిర్మాతలతో ఇబ్బంది పడినవారు మరో వర్గం. రెండో వర్గంలో శ్రీ రెడ్డి.. తను శ్రీ దత్త.. పలువురు సీనియర్స్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఇక లైంకిక ఒత్తిడులు ఎదురుకాని వర్గంలో రకుల్ ప్రీత్ సింగ్.. నిహారిక.. తదితరులతో పాటు బాలీవుడ్ నటి కాజోల్ చేరింది. కొన్ని రోజుల క్రితం నానా పటేకర్ తనని లైంగికంగా వేధించారని తనుశ్రీ దత్తా ఆరోపించడంతో బాలీవుడ్ లో దుమారం రేగింది. దీనిపై అమితాబ్ బచ్చన్.. ఆ ఇద్దరినీ అడగమని విలేకరులకు కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈ ఘటనపై నటి కాజోల్ సంచలన కామెంట్స్ చేసింది. “మహిళలపై లైంగిక వేధింపులు కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాలేదు.
ప్రతి చోటా ఉన్నాయి. నేనెప్పుడూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను ఎదుర్కొనలేదు. కానీ వీటి గురించి నేను విన్నాను. లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తులెవరూ తామే చేశామని మీడియా ముందుకు రారు” అని చెప్పింది. ఇంకా ఆమె మాట్లాడుతూ… “నా కళ్లముందు ఈ రకమైన వేధింపులు జరిగితే చూస్తూ ఊరుకోను. విదేశాల్లో వచ్చిన ‘మీ టూ’ తరహా ఉద్యమం మన దేశంలో కూడా రావాల్సిన అవసరం ఉంది” అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని పరిశ్రమల్లో క్యాస్టింగ్ కౌచ్ టాపిక్ ఇప్పట్లో సద్దుమనిగేలా లేదు.