Kali Movie: రిలీజ్ అవ్వడమే కష్టం అనుకుంటే.. కోటి బిజినెస్ చేసిన చిన్న సినిమా..!

4 ఏళ్ళ క్రితం ఇండస్ట్రీ పెద్దలు.. ‘సినిమా తీయడం ఈజీనే.. కానీ రిలీజ్ చేయడం కష్టం’ అనేవారు. ఇప్పుడైతే ‘సినిమా తీయడం ఈజీనే.. రిలీజ్ చేయడమూ ఈజీనే.. కానీ దానికి బిజినెస్ జరగడం కష్టం’ అని అంటున్నారు. అవును నిజమే సినిమా తీయడం ఈజీనే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ సినిమాని అందంగా తీయడం, బిజినెస్ జరిగేలా చేయడం, ఆ తర్వాత థియేటర్లలో రిలీజ్ చేయడం అనేది చాలా కష్టం.

Kali Movie

ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరక్కపోవడం వల్లే అనుకుంట.. చాలా సినిమాలు రిలీజ్ కి నోచుకోవడం లేదు. కనీసం తెలిసిన మొహాలు ఉంటే.. ఓటీటీ సంస్థలు ఎంతో కొంత రేటు అని చెప్పి ఇచ్చి తీసుకుంటాయి. అది కూడా బడ్జెట్లో 25 శాతం వరకు రేటు దొరికినా ఎక్కువే అని సర్దుకుపోయే దర్శక నిర్మాతలు చాలా మంది ఉన్నారు. అయితే ఓ చిన్న సినిమా రిలీజ్ కి ముందే బిజినెస్ చేసుకుని వార్తల్లో నిలిచింది. అది కూడా థియేట్రికల్ బిజినెస్ కావడం విశేషం.

ఆ సినిమా పేరు ‘కలి’ (Kali). చూడటానికి, వినడానికి కొంచెం ప్రభాస్ (Prabhaas) నటించిన ‘కల్కి…’ (Kalki 2898 AD) కి సిమిలర్ గా అనిపిస్తుంది కదూ.! బహుశా అదే ఈ సినిమాకి ప్లస్ అయినట్టు ఉంది. ప్రిన్స్ (Prince), నరేష్ అగస్త్య (Naresh Agastya) హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో ‘రుద్ర క్రియేషన్స్’ సంస్థపై లీలా గౌతమ్ వర్మ నిర్మాత నిర్మిస్తున్నారు. శివ శేషు ఈ చిత్రానికి దర్శకుడు. . సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 4న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

ప్రిన్స్, నరేష్ అగస్త్య.. వంటి చిన్న హీరోలు.. పైగా అంతంతమాత్రమే జనాలకి తెలిసిన హీరోలు నటించిన సినిమా అంటే ఓటీటీ బిజినెస్ కొంతవరకు జరుగుతుందేమో. కానీ ‘కలి’ (Kali) సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.70 లక్షల నుండి రూ.1 కోటికి ఔట్ రైట్ గా జరగడం అనేది చిన్న విషయం కాదు. ఇలా థియేట్రికల్ బిజినెస్ జరగడంతో పెట్టిన బడ్జెట్లో చాలా వరకు రికవరీ జరిగిపోయినట్టే అని తెలుస్తుంది. ఈ రోజుల్లో ఓ చిన్న సినిమాకి ఇలాంటి బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus