‘కల్కి..’ (Kalki 2898 AD) సినిమా టికెట్ రేట్లు వింటుంటే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. సింగిల్ స్క్రీన్స్ లో రూ.70 చొప్పున, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.100 చొప్పున.. పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ఒక్కో టికెట్ ధర రూ.377, మల్టీఫ్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్ ధర రూ.495 రూపాయలు గా ఉంటుంది. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో 3D చార్జీలు కాకుండా రూ.495 అని చెప్పాలి. ఒకవేళ ఆన్లైన్ బుకింగ్ అయితే సింగల్ స్క్రీన్స్ కి కూడా జీఎస్టీ వంటి వాటితో ఇంకో రూ.50 ఎక్కువవుతుంది.
ఏకంగా 8 రోజుల పాటు ఈ హైక్స్ ఉంటాయట. 5 రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ లో 5 వ షో వేసుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అంతా బాగానే ఉంది. కానీ ఒక్కో టికెట్ రూ.500 అంటే ఆడియన్స్ వస్తారా? ఫ్యాన్స్ అయితే పర్వాలేదు.. వాళ్ళు టికెట్ ధర రూ.2000 అయినా వెళ్ళిపోతారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ సంగతేంటి? ఈ రోజుల్లో ఓ ఫ్యామిలీ అంటే నలుగురు సినిమాకి వెళ్తున్నారు అనుకుంటే.. రూ.2000 చొప్పున టికెట్లకే పెట్టాలి.
స్ట్రాంగ్ పాజిటివ్ టాక్ వస్తే తప్ప.. ఈ టికెట్ రేట్లతో ఆడియన్స్ ని థియేటర్స్ వరకు రప్పించడం కష్టం. కానీ ‘కల్కి..’ టీంకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? అనేది చూస్తే… సంక్రాంతికి రిలీజ్ అయిన ‘గుంటూరు కారం’ తర్వాత ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కాలేదు. పైగా సమ్మర్లో ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కాలేదు.
కాబట్టి.. ‘కల్కి..’ సినిమాకి గట్టిగా టికెట్లు తెగే ఛాన్స్ ఉంది. ఓ పెద్ద సినిమా పడితే థియేటర్లకు వెళ్లాలని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆశగా ఎదురుచూస్తున్న టైం ఇది. అందుకే ‘కల్కి 2898 ad ‘ టీం భారీ టికెట్ హైక్స్ కోసం అప్లై చేసినట్టు స్పష్టమవుతుంది. ఇక మరో 4 రోజుల్లో అంటే జూన్ 27న ‘కల్కి..’ రిలీజ్ కాబోతోంది.