తన బాధను వ్యక్తం చేసిన హీరోయిన్..!

‘అన్యాయంగా నాపై వేశ్య అంటూ ముద్రవేశారు.. నేను వేశ్యని కాదు’ అంటుంది బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్‌. 2013లో వచ్చిన రణ్‌బీర్‌ కపూర్‌, దీపికా పదుకొణె ల బ్లాక్ బస్టర్ ‘యే జవానీ హై దివానీ’ లో నటించిన ఈ బ్యూటీకి ఆ తర్వాత సరైనా అవకాశాలు రాలేదు. అందుకు కారణం ‘ఓ నిర్మాత పడకగదికి రమ్మంటే.. నో చెప్పడమే కారణం అని చెబుతుంది ఈ బ్యూటీ. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్కి కొన్ని షాకింగ్ నిజాల్ని బయటపెట్టింది.

కల్కి కొచ్లిన్‌ మాట్లాడుతూ.. ” ‘యే జవానీ హై దివానీ’ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత.. దాదాపు 9 నెలలు గడిచినా ఎటువంటి ఆఫర్‌ రాలేదు. హిట్‌ లభించినప్పటికీ ఇలా జరగడం ఏంటా అని బాధేసింది. బాలీవుడ్, హాలీవుడ్ లోనూ వేధింపులు ఉన్నాయి. ఓ నిర్మాత నన్ను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వేధించాడు. తన పడక గదిలోకి రమ్మని అడుగగా.. దానికి నిరాకరించడం వలనే ఆఫర్లు రాకుండా చేసాడని చెప్పింది. ‘దేవ్‌ డి’ సినిమాలో కొందరు నన్ను చూసి ‘రష్యన్‌ వేశ్య’ అంటూ కామెంట్స్ చేశారు. ‘ఈ రష్యన్‌ వేశ్యను ఎక్కడి నుండీ తీసుకొచ్చారు?’ అని అన్నారు. ‘నేను రష్యన్‌ను కాదు’ అని చెప్పుకోవాల్సి వచ్చింది. ‘దేవ్‌ డి’ సినిమాలో కల్కి వేశ్య పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక కల్కి త్వరలో ఓ శిశువుకు జన్మనివ్వబోతుంది. ఇటీవల కల్కీ నెట్‌ఫ్లిక్స్ “సేక్రెడ్‌ గేమ్స్‌’లో కనిపించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus