మొత్తానికి ‘కల్కి’ కథ పై క్లారిటీ వచ్చేసింది..!

  • June 22, 2019 / 01:05 PM IST

దాదాపు దశాబ్ద కాలం తర్వాత ‘గరుడ వేగ’ చిత్రంతో హిట్టందుకున్నాడు యాంగ్రీ స్టార్ రాజశేఖర్. ఇప్పుడు అదే జోష్ తో ‘కల్కి’ చిత్రంతో రాబోతున్నాడు. థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ‘అ!’ వంటి విభిన్న చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని జూన్ 28 న విడుదల చేయబోతున్నారు. విడుదలైన టీజర్, పాటలకి మంచి ఆదరణ లభించడంతో పాటు సినిమా అంచనాల్ని కూడా పెంచేసాయి.

మరో వారంలో విడుదల కాబోతున్న ‘కల్కి’ చిత్రం పై కాపీ వివాదంలో చిక్కుకోవడం సంచలనంగా మారింది. కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే రచయిత ‘కల్కి’ కథ నాదేనంటూ ముందుకు వచ్చాడు. ఈ విషయం ‘కథా హక్కుల వేదిక’ వద్దకు వెళ్ళడం జరిగింది. ఈ విషయం పై వేదిక కన్వీనర్ బివిఎస్ రవి స్పందించాడు. ‘మేము కథా హక్కుల వేదికని ఏర్పాటు చేసి రచయితల మధ్య , దర్శకుల మధ్య తలెత్తుతున్న వివాదాలని పరిష్కరిస్తున్నాం. అలాగే రచయిత కార్తికేయ కథని, ‘కల్కి’ స్క్రిప్ట్ ని పరిశీలించాం. కానీ ఈ రెండు కథల్లో ఎలాంటి పోలికలు కనిపించలేదు. ‘కల్కి’ చిత్రం కాపీ కాదు.” అంటూ క్లీన్ చీట్ ఇచ్చారు. మొత్తానికి ‘కల్కి’ సినిమాకు అడ్డంకులన్నీ తొలగిపోయినట్టే. ఒకవేళ కథలో పోలిక ఉన్నా, రెండు కథలు ఒకేలా ఉన్నా అసలైన రచయితకు క్రెడిట్ ఇవ్వడం లేదా నగదు చెల్లించమని నిర్మాతలకు చెప్పడం ద్వారా సమస్య పరిష్కరిస్తామని కూడా బివిఎస్ రవి చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus