నవతరం విజేత కళ్యాణ్ దేవ్ | కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి “విజేత” అనే టైటీల్ ను ఫైనల్ చేశారు. కళ్యాణ్ దేవ్ సరసన “ఎవడే సుబ్రమణ్యం” ఫేమ్ మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఇవాళ విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. “చిరంజీవిగారి అల్లుడైన కళ్యాణ్ దేవ్ పరిచయ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి చిరంజీవి గారి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన “విజేత” టైటిల్ ను ఆయన అల్లుడు హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి పెట్టడం సంతోషంగా ఉంది. కథకు బాగా యాప్ట్ అవుతుంది. “బాహుబలి” చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చిత్రీకరణ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతోంది. త్వరలోనే టీజర్ ను విడుదల చేసి, జూలైలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus