కళ్యాణ్ కృష్ణకి అడ్డుగా మారిన అగ్రిమెంట్!

యువ డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ కొత్త సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆనందంగా చేసిన సంతకం ఇప్పుడు అతనికి అడ్డుగా మారి బాధపెడుతోంది. వివరాల్లోకి వెళితే.. కళ్యాణ్ కృష్ణ అక్కినేని నాగార్జునతో  ”సోగ్గాడే చిన్ని నాయనా” సినిమా చేశారు. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ మూవీ మొదలెట్టేటప్పుడే అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో మూడు సినిమాలు చేస్తానని సంతకాలు చేశాడు. ఈ బ్యానర్లో ఒకటి చేయడమే సంతోషం.. మూడు అనగానే కళ్యాణ్ కృష్ణ ఆనందంగా ఒప్పుకున్నాడు. రెండో సినిమా నాగచైతన్యతో “రా రండోయ్ వేడుక చూద్దాం” చేశాడు. అది కూడా హిట్ సాధించింది. మూడూ సినిమాని నాగార్జునతో చేయాలనీ “సోగ్గాడే చిన్నినాయనా”కి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ పాత్రను బేస్ చేసుకుని కథను సిద్ధం చేశాడు. అయితే అది నాగ్‌కు అంతగా నచ్చలేదు.

దాంతో మరో రెండు వెర్షన్స్ రెడీ చేసినా నాగ్‌ను మాత్రం మెప్పించలేకపోయాడట. ఈ విషయాన్ని పలుమార్లు నాగ్ విలేకరుల సమావేశంలో నూ ప్రస్తావించాడు. అయితే ఆ స్క్రిప్ట్ మాత్రం కళ్యాణ్ కి తెగ నచ్చింది. దాన్ని పక్కన బెట్టడం ఇష్టం లేక రవితేజతో తీయాలనికున్నాడు. మాస్ మహారాజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అనౌన్స్ మెంట్ చేద్దామని అనుకునేలోపున నాగార్జునతో ఒప్పందం అడ్డుగా నిలిచింది. ఇబ్బందులు తలైతే ఆస్కారం ఉన్నందున సినిమాని ఆపేసినట్లు సమాచారం.  ఇదే నిజమైతే  కళ్యాణ్ కృష్ణ ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus