మెగా, నందమూరి హీరోల మల్టీ స్టారర్ మూవీ లేనట్టేనా!

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా హీరోగాలు, నందమూరి హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఆ రెండు కుటుంబాలకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే దర్శకులు, నిర్మాతలు మెగా, నందమూరి హీరోల మల్టీ స్టారర్ మూవీ తీయాలని అనేకసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. రీసెంట్ గా దర్శకుడు రవికుమార్ చౌదరి ఆ ప్రయత్నంలో విజయవంతమయ్యారని వార్తలు వినిపించాయి. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ముందుకొచ్చిన ఈ చిత్రంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్ స్క్రీన్ ని షేర్ చేసుకోనున్నట్లు తెలిసింది.

ఈ వార్త అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి ఫ్యాన్స్ లో ఆనందాన్ని కలిగించాయి. అయితే తాజాగా ఆ ప్రాజక్ట్ ఆగిపోయిందని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ఆగిపోవడానికి స్క్రిప్ట్ బాగా లేకపోవడమే ప్రధాన కారణమని కొంతమంది చెబుతుండగా.. మరికొంతమంది ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న వృత్తి పరమైన విభేదాలే కారణమని అంటున్నారు. ఎవరి మాటల్లో ఎంత నిజం ఉందో చెప్పలేము కానీ.. నందమూరి, మెగా హీరోల మల్టీస్టారర్ సినిమా మాత్రం ఆగిపోయినట్టేనని స్పష్టంగా అర్ధమవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus