పొలిటికల్ డిజాస్టర్ నుంచి తప్పించుకున్న కళ్యాణ్ రామ్

మన హీరోలు ఒక్కోసారి వాళ్ళు రిజెక్ట్ చేసిన కథలు వేరే కథానాయకులతో సినిమాలుగా తెరకక్కి ఫ్లాప్ లేదా డిజాస్టర్ అయినప్పుడు తమ డెసిషన్ మేకింగ్ విషయంలో తెగ సంబరపడిపోతుంటారు. ఒకపక్క తన అక్క చుండ్రు సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తేదేపా తరపు నుంచి పోటీ దారుణంగా ఒడిపోయినందుకు బాధపడుతున్నప్పటికీ.. మరోపక్క ఆ విపత్కర పరిస్థితుల నుంచి తాను తప్పించుకున్నందుకు సంతోషపడుతున్నాడు.

మేటర్ ఏంటంటే.. హరికృష్ణ హఠాన్మరణం తర్వాత కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి కళ్యాణ్ రామ్ ను పోటీ చేయమని పెద్ద స్థాయిలో ఫోర్స్ చేయడం జరిగింది. కానీ.. తమ్ముడు ఎన్.టి.ఆర్ సూచన మేరకు అందుకు కళ్యాణ్ రామ్ ససేమిరా అనడంతో అతడి బదులు సుహాసినిని రంగంలోకి దింపారు. మరి తేదేపా పరాజయాన్ని ముందే ఉహించాడో లేక తెరాస ప్రభుత్వం పటిష్టంగా ఉండడాన్ని అర్ధం చేసుకున్నాడో తెలియదు కానీ.. కనీసం ప్రచారంలో కూడా పాల్గొనలేదు. ఇక నిన్న వచ్చిన రిజల్ట్ తో నందమూరి బ్రదర్స్ ఇద్దరూ సేఫ్ జోన్ లో పడ్డారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus