ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడంపై స్పందించిన కళ్యాణ్ రామ్

  • June 11, 2018 / 10:39 AM IST

మహానటుడు నందమూరి తారక రామారావు జీవితంపై ఎన్టీఆర్ అనే సినిమాని రూపొందించాలని ఆయన తనయుడు బాలకృష్ణ సంకల్పించారు. ఈ చిత్రాన్ని కొన్ని రోజుల క్రితం తేజ మొదలెట్టి పక్కకు తప్పుకున్నారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని క్రిష్ పట్టుకున్నారు. ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉండాలని స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దడంతో పాటు నటీనటులను సెలక్ట్ చేస్తున్నారు. ఈ మధ్య కొత్తవారికి కూడా ఆహ్వానం పలికారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారం పాత్రని విద్యాబాలన్, ఇందిరాగాంధీ రోల్ ని నదియా, కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పాత్రలో పరేష్ రావెల్ పోషించనున్నారు.

తాజాగా ఈ సినిమాలో చంద్రబాబునాయుడు పాత్రలో రానా కనిపించనున్నట్లు తెలిసింది. అలాగే హరికృష్ణ పాత్రను కళ్యాణ్ రామ్ పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై కళ్యాణ్ రామ్ స్పందించారు. అతను నటించిన ‘నా నువ్వే’ చిత్రం జూన్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు కళ్యాణ్ రామ్ బయోపిక్ పై స్పందించారు. “తేజాగారు నన్ను ఒక పాత్రలో అడిగారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజక్ట్ క్రిష్ చేతికి వచ్చింది. ఇంతవరకూ క్రిష్ దగ్గరనుంచి గానీ, చిత్ర యూనిట్ దగ్గరనుంచి గానీ కళ్యాణ్ రామ్ కు నటించమని పిలుపు రాలేదు. పిలుపు వస్తే నాకు నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు” అని స్పష్టం చేశారు. మరి క్రిష్ కళ్యాణ్ రామ్ కి రోల్ ఇస్తారా? లేదా? అనేది కొన్ని రోజుల్లో తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus