సంచలన కామెంట్స్ చేసిన తమన్నా

దక్షిణాది సినీ పరిశ్రమల్లోని నేటి హీరోయిన్స్ లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే ఎక్కువమంది మిల్కీ బ్యూటీ తమన్నా పేరే చెబుతారు. ఈమె తన అందం, అభినయంతోనే కాకుండా అదిరిపోరే డాన్స్ ట్యాలెంట్ తో అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో బెస్ట్ డ్యాన్సర్లు అయిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో పోటీ పోటీగా స్టెప్పులు వేసింది. బాహుబలి సినిమాల గ్యాప్ లో ఊపిరి సినిమా చేసిన ఈ బ్యూటీ.. బాహుబలి తర్వాత తెలుగు సినిమా చేయలేదు. రీసెంట్ గా జై లవకుశ సినిమాలో స్వింగ్ జరా అంటూ యువకుల మనసులను తన మూవ్ మెంట్స్ తో మెలిక పెట్టింది. ఇప్పుడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో “నా నువ్వే” అనే సినిమా చేస్తోంది. రొమాంటికల్ కామెడీ జాన్రాలో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో డ్యాన్స్ స్పెషల్ అని తెలిసింది.

ప్రధాన పాత్ర దారుల స్టెప్పులు అందరిని మైమరపిస్తాయని సమాచారం. ఈ విషయాన్నీ తమన్నా సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించింది. ఇంతవరకు బాగానే ఉంది గానీ కళ్యాణ్ రామ్ పై ప్రశంసలు గుప్పించడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. “కళ్యాణ్ రామ్ బెస్ట్ డ్యాన్సర్.. బెస్ట్ డ్యాన్స్ పార్టనర్” అంటూ చెప్పి వివాదానికి తెరలేపింది. ఇదివరకు యువ హీరోలతో నటించినప్పుడు తమన్నా ఈ తరహా స్టేట్ మెంట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు అలా చెప్పి ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లను కించపరిచిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకోసం కళ్యాణ్ రామ్ ఎంతకష్టపడ్డారో వెండితెరపై చూసి తమన్నా చెప్పింది కరెక్టో కాదో తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus