‘డెవిల్’ (Devil) తర్వాత కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నుండి మరో సినిమా రాలేదు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టాడు. కళ్యాణ్ రామ్ కెరీర్లో 21వ సినిమాగా ఇది మొదలైంది. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’, ‘అశోక క్రియేషన్స్’ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijaya Shanthi) కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె పాత్రకు సంబంధించిన గ్లింప్స్ కూడా వదిలారు. ఇందులో ఆమె పోలీస్ పాత్ర చేస్తున్నట్టు కూడా స్పష్టం చేశారు.
ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఇంకో అప్డేట్ రాలేదు. మొన్నామధ్య దీనికి ‘మెరుపు’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు కూడా అటాక్ వచ్చింది. కానీ దానికి సంబంధించిన అప్డేట్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని షాకింగ్ న్యూస్ లు బయటకి వచ్చాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా బడ్జెట్ లెక్కలు పెరిగిపోయాయట. ముందుగా ఈ సినిమాని రూ.40 కోట్ల బడ్జెట్లో ఫినిష్ చేయాలి అనుకున్నారు.
కళ్యాణ్ రామ్ మార్కెట్ కి అది తగిన బడ్జెట్. కానీ సగం షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వకుండానే అది రూ.55 కోట్లు దాటేసింది అనేది లేటెస్ట్ టాక్. దీంతో నిర్మాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అని టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడినట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి నిర్మాతగా పెట్టే బడ్జెట్ అంటూ ఏమీ ఉండదు. డేట్స్ ఇచ్చి.. ప్రమోషనల్ కి ఎంతో కొంత పెడతాడు. సో నిర్మాతకి డబ్బు అడ్జస్ట్ అయితే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకెళ్లే అవకాశాలు లేవు అని స్పష్టమవుతుంది.