Kalyan Ram, Jr NTR: అన్నయ్యతో ఎన్టీఆర్ బిజినెస్!

జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా కోసం 45కోట్ల పారితోషికం తీసుకున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక తదుపరి సినిమాలకు తారక్ ఈజీగా 60కోట్ల వరకు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ 30, 31 ప్రాజెక్టులకు కూడా అదే తరహాలో రావాల్సి ఉంటుంది. అయితే ఈసారి తారక్ తన సినిమాలకు తన అన్నయ్య కళ్యాణ్ రామ్ ను పాట్నర్స్ గా చేసుకోవడం విశేషం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కొరటాల శివ ప్రాజెక్ట్ ను మరో సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు.

కొరటాల స్నేహితుడి ప్రొడక్షన్ యువసుధ బ్యానర్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. అలాగే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం కూడా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి వర్క్ చేయనుంది. ఇక ఈ సినిమాలకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కాకుండా బిజినెస్ లో షేర్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అన్నయ్య ప్రొడక్షన్ స్థాయుని పెంచడానికి ఎన్టీఆర్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదివరకే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో జై లవకుశ సినిమా చేశాడు.

ఆ సినిమా పరవాలేదు అనే విధంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ తమ్ముడి పాన్ ఇండియా సినిమాలను భారీ స్థాయిలో నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఎన్టీఆర్ కేవలం ఈ ప్రాజెక్ట్ ల వరకే కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ ను కొనసాగిస్తాడా? లేక భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం కూడా ఇంకా అదే తరహాలో ఆలోచిస్తాడా అనేది చూడాలి.

ఇక ఎన్టీఆర్ లైనప్ లో అయితే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఉన్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ కూడా మైత్రి మూవీ మేకర్స్ లోనే ఉంటుందని టాక్ వచ్చింది. కానీ పుట్టినరోజు మాత్రం ఆ ప్రాజెక్ట్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఎన్టీఆర్ శంకర్ దర్శకత్వంలో కూడా సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus