మరో హిట్ కాంబినేషన్ రెడీ!

కళ్యాణ్ రామ్ కెరీర్‌లో సూప‌ర్ హిట్ గా నిలిచిన చిత్రం ప‌టాస్‌. దాదాపు ప‌దేళ్ల త‌ర‌వాత హిట్ అనే మాట వినిపించింది ఈ నంద‌మూరి హీరోకి. ఈ సినిమాతోనే అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభ చూపించుకొన్నాడు. ఆ త‌ర‌వాత సుప్రీమ్ తో మ‌రో హిట్ కొట్టాడు.

ఇప్పుడు రామ్ కోసం ఓ క‌థ సెట్ చేశాడు. అయితే మ‌ళ్లీ క‌ల్యాణ్ రామ్‌తో ఓ సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యాడ‌ట‌ ఈ పటాస్ డైరెక్టర్. ప‌టాస్ స‌మ‌యంలోనే క‌ల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి క‌ల‌సి ప‌నిచేయాల‌ని ఫిక్స‌య్యారు. కానీ.. ఎవ‌రి సినిమాల‌తో వాళ్లు బిజీగా ఉండ‌డం వ‌ల్ల ఆ కాంబినేష‌న్ సెట్ట‌వ్వ‌లేదు.

ఇటీవ‌లే క‌ల్యాణ్‌రామ్‌ని క‌లిసిన అనిల్ రావిపూడి.. ఓ క‌థ వినిపించ‌డం.. దాన్ని క‌ల్యాణ్ రామ్ లాక్ చేయ‌డం జ‌రిగిపోయాయ‌ని టాక్‌. ఇది పటాస్ సినిమాకు సీక్వెల్ గా ఉంటుందని సమాచారం. పూరితో కళ్యాణ్ రామ్ సినిమా పూర్త‌య్యాక అనిల్ రావిపూడి సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus