దాదాపు నాలుగేళ్ళ తర్వాత కళ్యాణ్ రామ్ కి ఓ హిట్టు కొట్టాడు. ‘పటాస్’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ‘షేర్’ ‘ఇజం’ ‘నా నువ్వే’ చిత్రాలు ఘోరంగా ఫ్లాపులయ్యాయి. ‘ఎం.ఎల్.ఏ’ చిత్రం పర్వాలేదనిపించినా యావరేజ్ గానే మిగిలింది. దీంతో కళ్యాణ్ రామ్ చాలా డీలా పడిపోయాడు. ఈ తరుణంలో ప్రముఖ సినిమాటోగ్రఫర్ గుహన్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన చిత్రం 118 చిత్రం కళ్యాణ్ రామ్ కష్టానికి ఫలితాన్నిచ్చింది. ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మించిన ఈ చిత్రం విడుదలైన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే మొదటి రోజు కల్లెక్షన్లు చూసి కలవరపడిన బయ్యర్లు ఆ తరువాత రోజు నుండీ ఊపిరి తీసుకున్నారు. ఈ చిత్రం 17 రోజులకి గానూ 10.2 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ‘118’ చిత్రం ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం – 3.84
సీడెడ్ – 1.20
నెల్లూరు – 0.23
కృష్ణా – 0.76
గుంటూరు – 0.68
వైజాగ్ – 1.14
ఈస్ట్ గోదావరి – 0.57
వెస్ట్ గోదావరి – 0.45
————————————————————
ఏపీ+తెలంగాణ – 8.87
(టోటల్)
కర్నాటకా + రెస్ట్ అఫ్
ఇండియా – 0.73
ఓవర్సీస్ – 0.42
————————————————————–
టోటల్ కలెక్షన్స్ – 10.02 కోట్ల షేర్
————————————————————–
పరీక్షల సీజన్ అయినప్పటికీ ఈ చిత్రం మంచి కల్లెక్షన్లనే రాబట్టిందని చెప్పాలి. ఈ చిత్రానికి 10 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వీక్ డేస్ పక్కన పెడితే… వీకెండ్స్ లో ఈ చిత్రం ఇప్పటికీ డీసెంట్ కల్లెక్షన్లనే నమోదు చేస్తుంది. పక్కన మరో పెద్ద సినిమాలు లేకపోవడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ వీకెండ్ కూడా సినిమాలేమీ లేవు కాబట్టి ఈ చిత్రానికే జనాలు ఓటేసే అవకాశం ఉంది. ఇక ఈ వీకెండ్ తోనే ఈ చిత్రం కలెక్షన్లు క్లోజ్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.