కళ్యాణరాముడు ఎమ్మెల్యేగా గెలుస్తాడా.!

హీరోగా ఇప్పటివరకూ 15 సినిమాల్లో నటించినప్పటికీ కళ్యాణ్ రామ్ కెరీర్ లో “అతనొక్కడే, పటాస్” మినహా చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు. వచ్చిన రెండు హిట్స్ ను కూడా సరిగా వినియోగించుకోలేకపోయాడు కళ్యాణ్ రామ్. అయితే.. నిర్మాతగా మాత్రం ఇటీవల మంచి విజయాన్ని అందుకొన్నాడు. తమ్ముడు జూనియర్ ఎన్టీయార్ తో తీసిన “జైలవకుశ” మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ ఆనందంతోనే ఒకేసారి రెండు సినిమాలు ప్రారంభించాడు. “ఎమ్మెల్యే, నా నువ్వే” సినిమాలు ఆల్మోస్ట్ ఒకేసారి షూటింగ్ జరుపుకొన్నాయి. “ఎమ్మేల్యే” ఈ శుక్రవారం విడుదలకానుంది.

కెరీర్ కి చాలా కీలకం కావడంతో తాను పరిచయం చేశానన్న ఒకే ఒక్క ఆంక్షతో కాజల్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా నటింపజేశాడు కళ్యాణ్ రామ్. కాజల్ అందం, కామెడీ ఈ సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయట. పోలిటికల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై కళ్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు. ఈ సినిమా రిజల్ట్ బట్టి తన తదుపరి చిత్రాల ఓపెనింగ్స్ మాత్రమే కాక రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది. మరి కళ్యాణ్ రామ్ కోరిక ఫలించి “ఎమ్మెల్యే” మంచి హిట్ అయ్యిందంటే అంతకంటే లక్కీ క్యాండిడేట్ మరొకడుండడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus