కళ్యాణ్ రామ్-తమన్నాల “నా నువ్వే” రిలీజ్ డేట్ ఫిక్స్!

హీరోగా కళ్యాణ్ రామ్ ఇప్పటివరకూ అన్నీ ప్రయోగాలే చేశాడు. నిజానికి తెలుగులో మొదటి త్రీడీ సినిమా చేసింది కళ్యాణ్ రామే. అయితే అదృష్టం కలిసి రాక సినిమాలు హిట్ అవ్వలేదు. మధ్యలో “పటాస్”తో ప్రొడ్యూసర్ గానూ, హీరోగానూ సూపర్ హిట్ అందుకొన్నా.. తర్వాత వచ్చిన “టైగర్”తో అదంతా పోయింది. అయితే గతేడాది “జైలవకుశ”తో ప్రొడ్యూసర్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న కళ్యాణ్ రామ్ ఈ ఏడాది హీరోగానూ హిట్ కొట్టాలని డిసైడ్ అయినట్లున్నాడు. అందుకే తన లుక్ తో పాటు స్క్రిప్ట్ సెలక్షన్ ఫార్మాట్ ను కూడా మార్చుకొని మరీ “నా నువ్వే, ఎమ్మెల్యే” చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటిలో “ఎమ్మేల్యే” కామెడీ ఎంటర్ టైనర్ కాగా.. “నా నువ్వే” క్యూట్ లవ్ స్టోరీ.

“180” ఫేమ్ జయేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “నా నువ్వే: టీజర్ ఆల్రెడీ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని మే 25న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ కి కూడా మంచి హోప్స్ ఉన్నాయి. టెక్నికల్ గానూ ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుంది. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమా హీరోగా కళ్యాణ్ రామ్ కి ఎలాంటి పేరు తీసుకువస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus