KalyanDev: వైరల్ అవుతున్న కళ్యాణ్ దేవ్ పోస్ట్!

కళ్యాణ్ దేవ్ పరిచయం అవసరం లేని పేరు మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ భర్తగా ఈయన అందరికీ పరిచయమే అలాగే హీరోగా కూడా పలు సినిమాలలో నటించి సందడి చేశారు. అయితే ప్రస్తుతం మెగా కుటుంబంతోపాటు ఈయన సినిమాలకు కూడా దూరంగా ఉండటం వల్ల శ్రీజతో మనస్పర్ధలు వచ్చే విడాకులు తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గత రెండు సంవత్సరాల నుంచి శ్రీజ కళ్యాణ్ దేవ్ దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

కళ్యాణ్ దేవ్ (KalyanDev) నటిస్తున్న సినిమాలకు మెగా కుటుంబం సపోర్ట్ లేకపోవడమే కాకుండా మెగా ఫ్యామిలీలో జరుగుతున్న కార్యాలకు కళ్యాణ్ దేవ్ దూరంగా ఉండటంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని విడాకులు కూడా తీసుకున్న కానీ అధికారకంగా తెలియచేయలేదని తెలుస్తోంది. అయితే ఈ వార్తలను ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం మేగా ఫ్యామిలీ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.ఇక శ్రీజకు దూరంగా ఉంటున్నటువంటి కళ్యాణ్ దేవ్ పరోక్షంగా తన జీవితం గురించి సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈయన చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. కొంతమందిని చూస్తే చాలా జాలి వేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసినది కేవలం గోరంత మాత్రమే తెలియాల్సింది కొండంత ఉంది అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.అయితే ఈయన పరోక్షంగా తనకు శ్రీజకు మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను ఉద్దేశించి ఈ విధమైనటువంటి పోస్ట్ చేశారని పలువురు భావిస్తున్నారు.

శ్రీజ తనకు మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు గురించి అందరికీ తెలిసినది చాలా తక్కువ అని, చాలా సమస్యలు ఉన్నాయి అంటూ పరోక్షంగా ఈయన తెలియజేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక శ్రీజ తన భర్తకు దూరంగా ఉన్నప్పటికీ తన ఇద్దరు పిల్లలను తన వద్ద ఉంచుకున్న విషయం మనకు తెలిసిందే.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus