చిత్ర పరిశ్రమలో ట్యాలెంట్ కి సక్సస్ కి సంబంధం ఉండదని సంగీత దర్శకుడు శ్రీ కళ్యాణ్ రమణ (కళ్యాణ్ మాలిక్) చెప్పారు. ఇతను “ఐతే” సినిమా ద్వారా మ్యూజిక్ డైరక్టర్ గా పరిచమై, తొలి చిత్రం తోనే విజయాన్ని అందుకున్నారు. డిఫరెంట్ మ్యూజిక్ తో యువతను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత అలా మొదలయింది, అష్టా చెమ్మా, కల్యాణ వైభోగం వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. “ఊహలు గుసగుస లాడే” సినిమా పాటలైతే అనేక అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఆ చిత్ర టీమ్ తో కలిసి “జ్యో అచ్యుతానంద”. మూవీకి పాటలు ఇచ్చారు. రీసెంట్ గా రిలీజ్ అయినా ఈ ఫిల్మ్ ఆడియో అభినందనలు అందుకుంటోంది. ఈ సందర్భంగా అయనను కలిసిన మీడియా వారికి శ్రీ కళ్యాణ్ రమణ సినీ పరిశ్రమకు చెందిన ఆసక్తికర విషయాలు చెప్పారు. “ఇక్కడ ప్రతిభ ఉంటే సరిపోదు.
అదృష్టం కూడా ఉండాలి. అన్ని రంగాల్లోనూ ఎంతో కొంత లక్ ఉండాలి కానీ సినీ పరిశ్రమలో 90 శాతం లక్ ఉండాలి” అని కళ్యాణ్ రమణ స్పష్టం చేశారు. “నేను మ్యూజిక్ డైరక్టర్ గా 14 సినిమాలు చేసాను. మంచి ఆల్బమ్స్ ఇచ్చాను అయినా నాకు అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఏడాదికి ఒక్కొక్కటి మాత్రమే చేయగలుగుతున్నా. మొదట్లో నా పరిస్థితిని గమనించి కొందరు పీఆర్ పెంచుకోవాలని సలహా ఇచ్చారు. కొన్నాళ్లు హీరో, డైరక్టర్స్ తో కలిసి తిరిగాను, అయినప్పటికీ ఛాన్స్ లు అంతంత మాత్రమే. అందుకే సినీ ఫీల్డ్ లో ట్యాలెంట్ కి సక్సస్ కి సంబంధం ఉండదని నా ఉద్దేశం” అని అయన వెల్లడించారు.