ఈమధ్యకాలంలో ఇన్స్టాంట్ చార్ట్ బస్టర్ గా నిలిచిన పాట “అల వైకుంఠపురములో” చిత్రంలో “సామజవరగమన” పాటను వినని తెలుగు ప్రేక్షకుడు, శ్రోత ఉండడు. ఆ రేంజ్ లో హిట్ అయ్యింది సాంగ్. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం, తమన్ స్వరాలు కలగలిసి.. సీడ్ శ్రీరామ్ వాయిస్ తో పాటకు ప్రాణం వచ్చింది. ఈ పాటను రిపీట్ మోడ్ లో వింటున్నారు జనాలు. అయితే.. ఇంత పెద్ద చార్ట్ బస్టర్ కి కూడా నెగిటివ్ కామెంట్స్ తప్పలేదు. అలా కామెంట్ చేయడంలోనూ తప్పు లేదు. ఎందుకంటే.. సీతారామశాస్త్రి ఒక ప్రేమికుడి బాధను ఎంతో కళాత్మకంగా రాసిన సాహిత్యాన్ని సిడ్ శ్రీరామ్ సరిగా ఉచ్చరించలేకపోయాడు.
ఈ మేరకు తెలుగు భాషాభిమానులు చాలామంది సిడ్ శ్రీరామ్ మీద మండిపడ్డారు. వారిలో సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ కూడా ఒకడు. “సామజవరగమన” అనే పాటను ప్రస్తావించకుండా.. “నీ ఉచ్చారణకి నా జోహార్లు.. కేవలం నీ టైమ్ నడుస్తుంది కాబట్టి.. నువ్వెలా ఖూనీ చేసి పాడినా దాన్ని అదే మహా ప్రసాదం అని భావించిన ఆ సంగీత దర్శకుడికి సాష్టాంగ ప్రణామాలు. My deepest condolences to the lyrics” ఒక పోస్ట్ పెట్టాడు కళ్యాణి మాలిక్. నెటిజన్లకు వెంటనే ఇది ఆ పాట కోసమే అని అర్ధమైపోయింది. నిజమే మరి.. సిరివెన్నెల గారు రాసిన సాహిత్యం కోసమైనా ఆ ఉచ్ఛారణ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.
‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?