Kamal Haasan: బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ కీర్తి పై ప్రశంసలు కురిపించిన కమల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ తాజాగా నటి కీర్తి సురేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కీర్తి సురేష్ ఉదయనిది స్టాలిన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం మామన్నన్.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చెన్నైలో ఎంతో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా (Kamal Haasan) కమల్ హాసన్ హాజరయ్యారు.ఇక ఈ సినిమా గురించి ఆయన పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించడమే కాకుండా ఇలాంటి పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ సినిమాలో కీర్తి సురేష్ వంటి హీరోయిన్ నటించడం నిజంగా గ్రేట్ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ఒక మంచి సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చిత్ర బృందానికి కమల్ హాసన్ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కీర్తి సురేష్ గురించి కమల్ హాసన్ మాట్లాడుతూ కీర్తి సురేష్ ఒక గొప్ప నటి అని తెలియజేశారు. అలాగే ఆమెని పొగుడుతూ బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ తనపై ప్రశంసలు కురిపించారు. ఇలా కీర్తి సురేష్ గురించి కమల్ హాసన్ వంటి ఒక గొప్ప నటుడు ఆమెపై పొగడ్తల వర్షం కురిపించడంతో కీర్తి సురేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికొస్తే ఈమె తాజాగా నాని హీరోగా నటించిన దసరా సినిమాలో వెన్నెల పాత్రలో నటించి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈమె తదుపరి సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఈమె మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించబోతున్నారు త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus