రజినీ కాంత్, మహేష్ బాబు లకు షాకిచ్చిన కమల్ హాసన్

వేసవిలో స్టార్ హీరోల సినిమా మధ్య వార్ నడవనుంది. ఒకే వారంలో రిలీజ్ అయితే నిర్మాతలకు కష్టాలు తప్పదని గ్రహించిన సినీ పెద్దలు అందరికీ తేదీలు పనిచేశారు. వారం గ్యాప్ లో రజినీకాంత్, మహేష్ బాబు,అల్లు అర్జున్ సినిమాలు రిలీజ్ కానున్నట్లు అధికార ప్రకటన వచ్చింది. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్, కొరటాల శివ చేస్తున్న సినిమా భరత్ అనే నేను ఏప్రిల్ 20 న సందడి చేయనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 27 న రజనీకాంత్ కాలాగా వస్తున్నాడు. ఇక వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న నా పేరు సూర్య మే 4 న థియేటర్లలోకి రానుంది.

అంతా ఒకే అనుకున్న సమయం లో విశ్వనటుడు కమల్ హాసన్ షాకిచ్చారు. తాను వేసవిలోనే ఫైట్ కి వస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్య పరిచారు. కమల్ హాసన్ వివాదస్పద కథతో తెరకెక్కించిన “విశ్వరూపం” 2013 లో రిలీజ్ అయి విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌ “విశ్వరూపం 2”ని వెంటనే రిలీజ్ చేస్తానని అప్పుడు చెప్పారు. అయితే అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం కమల్ రాజకీయంలోకి అడుగుపెట్టేసరికి.. అతని సినిమాలను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందులో ముందుగా “విశ్వరూపం 2”ని విడుదల చేయనున్నారు. అయితే రజినీ కాలా వచ్చే ఏప్రిల్ 27 నే కమల్ సినిమా రావచ్చని భావిస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడిన తరవాత అసలైన వేడి రాజుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus