Kamal Haasan: ‘విక్రమ్‌’లో కమల్‌ పాత్ర మామూలుగా ఉండదట!

రాబోయే కమల్‌ హాసన్‌ సినిమాలో వైవిధ్యం ఉంటుంది అని చెప్పడం చాలా చిన్నమాట. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాలోనూ చేసే పని అదే. ఏ రెండు వరుస సినిమాలు ఒకేలా ఉండవు ఆయన కెరీర్‌లో. తాజాగా ఆయన ‘విక్రమ్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ చాలా రోజుల క్రితమే వచ్చింది. తాజాగా సినిమా చిత్రీకరణ పునర్‌ ప్రారంభమైంది. ఈ క్రమంలో సినిమా గురించి ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది.

‘విక్రమ్‌’ సినిమాలో కమల్‌ ఎలా ఉంటాడు, యాటిట్యూడ్‌ ఏంటి, కాన్సెప్ట్‌ ఏంటి అనేది చూచాయగా చూపిస్తూ టీజర్‌ ఇచ్చేశారు. అందులో పెద్దగా చెప్పని, చూపించిని పాయింట్‌ ఇంకొకటి ఉందట. అదే కమల్‌ క్యారక్టరైజేషన్‌. అవును ఈ సినిమాలో కమల్‌ అంధుడిగా కనిపిస్తాడని కోలీవుడ్‌లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగా కథను, సినిమాను రాసుకున్నారట లోకేశ్‌. కమల్‌ అంధుడిగా కనిపించడం ఇదే తొలిసారి కాదు.

గతంలో ‘అమావాస్య చంద్రుడు’ అనే సినిమాలో కమల్‌ ఇలా అంధుడిగా కనిపించారు. ఆ సినిమాలో కమల్ నటనను ప్రేక్షకులు, అభిమానులు ఇప్పటికీ మరచిపోరు. ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్లీ ఆ వింటేజ్‌ కమల్‌ను చూడబోతున్నాం అన్నమాట. అంధుడిగా కమల్‌ ఎలా నటిస్తాడు, ఎంత సందడి చేస్తాడో చూడాలి మరి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus