విక్రమ్ హీరో.. కమల్ ప్రొడ్యూసర్

అభిమానులందరూ ‘లోకనాయకుడు’ అని అభిమానంతో పిలుచుకొనే కమల్ హాసన్ కి ఈమధ్య సరైన విజయాలు లేకపోవడం, చేస్తున్న సినిమాలు కారణాంతరాల వలన గత రెండేళ్లుగా పోస్ట్ పోన్ అవుతూనే ఉండడం, రాజకీయ ఎంట్రీ విషయంలో ఇంకా క్లారిటీ లేకపోవడం వంటి విషయాల కారణంగా ఆయన్ని ప్రెజంట్ జనరేషన్ పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ.. నిజానికి కమల్ ఓ నడిచే నట విశ్వవిద్యాలయం లాంటి వ్యక్తి. అటువంటి కమల్ హాసన్ హీరోగా సినిమా చేయడం తగ్గించడం ఆయన అభిమానులకు మింగుడుపడడం లేదు. అయితే.. ఆ లోటును తీర్చేందుకు ఆయన నిర్మాతగా అవతారమెట్టబోతున్నాడు.

కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన “చీకటిరాజ్యం” చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాజేష్ కు మరోమారు దర్శకుడిగా అవకాశమిస్తున్నాడు కమల్. అయితే.. ఈమారు హీరోగా ఆయన నటించడం లేదు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తూ.. సహజనటుడు విక్రమ్ ను హీరోగా పెట్టి ఓ సినిమా రూపొందించనున్నాడు. రాజ్ కమల్ ఫిలిమ్స్ పతాకంపై ట్రైడెంట్ ఆర్ట్స్ అనే సంస్థతో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ ముఖ్యపాత్ర పోషించనుండడం విశేషం. ఈ ఎనౌన్స్ మెంట్ ను కమల్ హాసన్ స్వయంగా చేయడం విశేషం.
సో, కమల్ హాసన్-విక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus