విక్రమ్ గా వికృతరూపాన్ని చూపిన కమల్ హాసన్..!

డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమా తీసి సౌత్ ఇండియాని అబ్బురపరిచాడు. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన కార్తీ ఖైదీ తెలుగులో కూడా అద్భుతమైన రిజల్డ్స్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రేంజ్ మారిపోయింది. విజయ్ తో కలిసి మాస్టర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇదే టైమ్ లో కమల్ హాసన్ తో కూడా ఒక ప్రయోగాత్మకమైన సినిమాకి శ్రీకారం చూట్టాడు. విక్రమ్ అనే టైటిల్ తో కమల్ లోని మరో కోణాన్ని ఆడియన్స్ కి చూపించబోతున్నాడు.

అంతేకాదు, కమల్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతోందో అనే టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. ట్రెండింగ్ 1 లో దూసుకుపోతోంది. తమిళంలో రిలీజ్ చేసిన ఈ టీజర్ ని ఇప్పటివరకూ 5మిలియన్స్ పైగా ప్రేక్షకులు వీక్షించారు. ఇప్పుడు కమల్ విక్రమ్ టీజర్ హాట్ ఆఫ్ ది కోలీవుడ్ గా మారింది. ఈ టీజర్ లో కమల్ ఎక్స్ ప్రెషన్స్ సూపర్బ్ అంటూ, లోకేష్ కనకరాజ్ ఇలాంటి కాన్సెప్ట్ మూవీలు అద్దిరిపోయేలా తీస్తాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక టీజర్ లో కమల్ తన వికృతమైన హావభావాలన్నింటిని సింగిల్ ఎక్స్ ప్రషన్ లో చూపించాడు. గన్స్, కత్తులు, ఇంట్లో దాస్తూ, అరిటాకుల్లో అతిథులకి భోజనం వడ్డిస్తూ, అందర్నీ టేబుల్ పైన కూర్చోబెట్టి, టేబుల్ కిందనుంచి మారణాయుధాలని తీసి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ టీజర్ లోనే హైలెట్ గా నిలిచింది. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూస్తే కరెక్ట్ గా 1.41 సెకన్స్ దగ్గర ఆ ఎక్స్ ప్రెషన్ ని మీరు కూడా చూడచ్చు.


‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus