Divya Bharti: 31 ఏళ్ళ తర్వాత దివ్య భారతి మరణం పై బాలీవుడ్ స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

Advertisement

ఒకప్పుడు తన గ్లామర్ తో సినీ పరిశ్రమని ఓ ఊపు ఊపేసిన వారిలో దివ్య భారతి (Divya Bharti) ఒకరు. 17 ఏళ్లకే స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈమె ఆ స్టార్ డంని అనుభవించకుండానే 19 ఏళ్లకే ప్రమాదవశాత్తు మరణించింది. ముంబైలోని ఓ బిల్డింగ్ పై నుండి, అదీ 5 వ అంతస్తు పై నుండి కింద పడి ఆమె ప్రాణాలు విడిచింది. ఆమెను ఎవరో పై నుండీ తోసేశారు అంటూ అప్పట్లో చాలా గాసిప్స్ వినిపించాయి.

ఆమె మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే..! అయితే ఆమె చనిపోయిన 31 ఏళ్ళ తర్వాత ఓ బాలీవుడ్ నటుడు .. దివ్య భారతి మరణం పై స్పందించడం జరిగింది. వివరాల్లోకి వెళితే.. దివ్యభారతి మృతి పై బాలీవుడ్ నటుడు కమల్ సదానా (Kamal Sadanah) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. అతను మాట్లాడుతూ…”దివ్యభారతి మరణం నన్ను ఇప్పటికీ బాధించే అంశం. ఆ టైంలో ఆమె చనిపోయింది అనే నిజాన్ని నేను తీసుకోలేకపోయాను.

ఎందుకంటే.. ఆమె చాలా టాలెంటెడ్. ఆమెతో కలిసి పని చేయడం అనేది నాకు చాలా సరదాగా అనిపించేది.కానీ, చిన్న వయసులోనే ఆమె మరణించింది అనే వార్త విని నేను షాకయ్యాను. ఎందుకంటే.. ఆమె చనిపోయిన 3 రోజుల ముందు ఆమెతో నేను కలిసి పని చేశాను. దివ్వ భారతి మరణం ప్రమాదవశాత్తు జరిగింది అని విన్నాను. కానీ ఆమె చనిపోయే ముందు కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు అని నాకు అనిపించింది.

ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. ఆరోగ్యంగా ఉండేది. మత్తు వల్లనే ఆమెకు అలాంటి ప్రమాదం సంభవించిందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది.దివ్యభారతి చనిపోయే టైంకి ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. దివ్య భారతి కనుక అవి చేసి ఉంటే చాలా పెద్ద స్టార్ అయ్యిండేది” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus