కలిసి సినిమా చేయనున్న కమల్, విక్రమ్

విశ్వనటుడు కమల హాసన్, విలక్షణ నటుడు విక్రమ్ కలిసి సినిమా చేయనున్నారా?.. తమిళంలో మరో సంచలన సినిమా రూపుదిద్దుకోనుందా? అంటే అందుకు కోలీవుడ్ వర్గాలవారు అవుననే సమాధానం ఇస్తున్నారు. అయితే ఇద్దరు కలిసి నటించడం కాదు.. కమల్ నిర్మాణంలో విక్రమ్ హీరోగా నటిస్తారని సమాచారం. ప్రస్తుతం కమలహాసన్‌ రాజకీయరంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్నారు. త్వరలోనే పార్టీ పేరు, గుర్తును వెల్లడించనున్నారు. ఈ పనుల్లో పూర్తిగా మునిగిపోకముందే ఆయన నటిస్తున్న విశ్వరూపం–2, శభాష్‌నాయుడు చిత్రాలను తొందరగా విడుదల చేయాలనీ భావిస్తున్నారు. దీని తర్వాత ఎక్కువ సమయం సినిమాకి కేటాయించలేక పోవడం వల్ల తాను నటనకు బ్రేక్ ఇచ్చారు. అయితే సినిమాపై ఉన్న మమకారంతో మంచి కథలను నిర్మించాలని కమల్ అనుకుంటున్నారు.

అందుకే సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఒక క్రేజీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజేశ్‌ సెల్వ చెప్పిన కథ బాగుండడంతో ఆయనకీ దర్శకత్వ బాధ్యతలు ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాలవారు తెలిపారు.రాజేశ్‌ ఇంతకుముందు కమలహాసన్, త్రిష జంటగా నటించిన తూంగావనం చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు కమల్ నిర్మాణంలో తెరకెక్కే చిత్రంలో హీరోగా విక్రమ్ ని ఖరారు చేసినట్లు తెలిసింది. గతంలో కమల్‌ నిర్మాతగా నాజర్‌ ప్రధాన పాత్రలో మగళీర్‌ మట్టుం, సత్యరాజ్‌ హీరోగా కడమై కన్నియం కట్టుపాటు, మాధవన్‌ కథానాయకుడిగా నలదమయంతి వంటి చిత్రాలను నిర్మించారు. మళ్ళీ చాలా రోజులకి వేరే హీరోతో సినిమా నిర్మిస్తున్నారు. దీంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus