కమలినీ ముఖర్జీని చూశారా!.. ఎంతలా మారిపోయియిందో.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

కమలినీ ముఖర్జీ.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఆనంద్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘స్టైల్’, ‘గమ్యం’, ‘జల్సా’, ‘గోపి గోపిక గోదావరి’, ‘నాగవల్లి’ వంటి పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో డెబ్యూ చేసినా కానీ టాలీవుడ్‌లోనే ఎక్కువ పేరు సంపాదించుకుంది. తమిళ్, మలయాళం, బెంగాళీ భాషల్లోనూ నటించి మెప్పించింది.. 2016లో మోహన్ లాల్ పక్కన ‘పులిమురుగన్’ (మన్యంపులి) లో నటించింది.

తెలుగులో రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. 42 ఏళ్ల కమలినీ ముఖర్జీ యూఎస్‌లో సెటిలైనట్టు సమాచారం. పెళ్లి చేసుకుందా లేదా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే రీసెంట్‌గా డల్లాస్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో కనిపించి ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. లావుగా గుర్తు పట్టలేనంతంగా మారిపోయింది. దీంతో ఆమెని చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. కమలినీ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus