Kamna Jethmalani: కవ్వించే అందాలతో కాక పుట్టిస్తున్న కామ్నా జెఠ్మలానీ..సెకండ్ ఇన్నింగ్‌లో ఫుల్ జోష్ లో ఉందిగా..!

కామ్నా జఠ్మలానీ ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు సినిమాల్లో సత్తా సాటిన నటి. కామ్నా జఠ్మలానీ తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కామ్నా నటించిన మూడో చిత్రమైన రణం విజయవంతమై కామ్నాకి గుర్తింపునిచ్చింది. అలాగే మొదటి తమిళ చిత్రం కూడ విజయ వంతమైంది. ఈమె తెలుగు, తమిళ్, కన్నడ చిత్రపరిశ్రమలొ పనిచేసింది. కత్తి కాంతారావు అల్లరి నరేష్ సరసన కత్తి కాంతారావు సినిమా గుర్తింపు తెచ్చింది.

సామాన్యుడు, సైనికుడు, టాస్, కింగ్, అందమైన అబద్ధం, యాక్షన్ త్రీడీ, శ్రీ జగద్గురు ఆదిశంకర, భాయ్ వంటి సినిమాల్లో కనిపించింది. చివరిగా చంద్రిక అనే తెలుగు సినిమాలో కనిపించిన ఆమె తెలుగు సినీ పరిశ్రమకు దూరం అయిపోయింది. తర్వాత ఏడేళ్ల గ్యాప్ తర్వాత కన్నడలో గరుడ అనే సినిమాతో రియంట్రి ఇచ్చింది. అయితే కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరు కు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుంది.

పెళ్ళి తరువాత సినిమాల వైపు చూడలేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది ముద్దుగుమ్మ. తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతోంది. సినిమాలకు గుడ్ బై చెప్పిన కామ్నా తన భర్తకు వ్యాపారంలో తోడుగా ఉంటోంది. ఆమె తన కుటుంబంతో కలిసి బెంగళూరులోనే నివాసముంటున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఈ అమ్మడుకు అవకాశాలు రావడం కష్టమే అనుకుంటున్నా సమయంలో ఇప్పుడు ఆమె మరోసారి వెబ్ సీరిస్ తో రీ ఎంట్రీ ఇచ్చారు.

ఈ మధ్యనే జీ తెలుగులో వ్యవస్థ అనే వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చిన (Kamna Jethmalani) ఆమె ఆ వెబ్ సిరీస్ లో సంపత్ రాజు భార్య పాత్రలో కనిపించింది. ఇక రీఎంట్రీ తర్వాత ఆమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. అందులో భాగంగానే వైట్ షర్ట్, బ్లాక్ పాంట్ ధరించిన ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు మీరు కూడా చూసేయండి మరి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus