రీ ఎంట్రీ ఇవ్వబోతున్న కామ్నా జట్మలాని.. నిజమేనా..?

‘ప్రేమికులు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కామ్నా జట్మలాని.. ఆ తరువాత గోపీచంద్ హీరోగా వచ్చిన ‘రణం’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రంలో విచ్చల విడిగా గ్లామర్ షో చెయ్యడంతో.. ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ‘సామన్యుడు’ ‘బెండు అప్పారావు RMP’ ‘కత్తి కంతారావు’ వంటి హిట్టు సినిమాల్లో నటించింది. మహేష్ బాబు ‘సైనికుడు’.. నాగార్జున ‘కింగ్’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. అయినప్పటికీ ఈమెకు సరైన గుర్తింపు రాలేదు.

దీంతో 2014, ఆగష్టు 11న బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది.బెంగుళూర్ లో అతి తక్కువ మంది సమక్షంలో ఈమె పెళ్ళి జరిగిందట.ఈమె ప్రముఖ రాజకీయ నాయకుడు రాం జట్మలాని మనవరాలు అన్న సంగతి చాలా మందికి తెలీదు. ఇక కామ్నా జట్మలానికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం వారి ఆలన పాలన చూసుకుంటుంది. ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి తన ఫ్యామిలీ పిక్స్ ను పోస్ట్ చేసింది. అయితే కామ్నా జట్మలాని మొహంలో మునుపటి కళ లేదనే చెప్పాలి. ‘అప్పట్లో కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ కళ కళ లాడుతూ ఉండేది.

కానీ ఇప్పుడు అలా లేదు.’ అంటూ కొందరు నెటిజెన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. త్వరలోనే ఈమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఓ తెలుగు సినిమాకి ఈమె సైన్ చేసిందని టాక్ నడుస్తుంది.ప్రభు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో ఈమె కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తుంది. మరి ఆ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus