కాలా రిలీజ్ డేట్ కణంకి కలిసొచ్చింది

ఎప్పుడో ఫిబ్రవరిలో విడుదలవ్వాల్సిన ‘కణం’ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ డేట్ దొరికింది. ‘కణం’ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థే ‘కాలా’ చిత్రాన్ని కూడా నిర్మించడం, ‘కాలా’ రిలేజ్ డేట్ జూన్ 7కి పోస్ట్ పోన్ అవ్వడంతో ఆ సినిమా కోసమని బ్లాక్ చేసిన ఏప్రిల్ 27వ తారీఖున “కణం” చిత్రాన్ని విడుదల చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన రంగం సిద్ధం చేశారు. సాయిపల్లవి, నాగశౌర్య జంటగా నటించిన ఈ చిత్రానికి విజయ్ దర్శకుడు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేద్దామని ప్రయత్నించారు. అయితే.. హీరో శౌర్యకు హీరోయిన్ సాయిపల్లవి మధ్య సమస్యలు తలెత్తడం, హీరో శౌర్య ప్రమోషన్స్ కి రావడానికి నిరాకరించడంతో “కణం” సినిమా మీద ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు.

ఇప్పుడు ఉన్నట్లుండి ఏప్రిల్ 27న “కణం” రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయడంతో ఇప్పుడు సడన్ రిలీజ్ వల్ల ఏం ఉపయోగం ఉందని ట్రేడ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సాయిపల్లవికి ఉన్న క్రేజ్ “కణం” సినిమాకి ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి. లేకపోతే.. నిర్మాతలు సినిమాని బయటపడేయడమే ధ్యేయంగా అర్జెంట్ గా సినిమాని రిలీజ్ చేసేస్తున్నారేమోననే వాదనలు కూడా వినపడుతున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవి దెయ్యం పాత్రలో కనిపించనుందని వినికిడి. మరి ఆ వార్తలో నిజం ఎంతో ఇంకోవారంలో తేలిపోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus